
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix నుంచి త్వరలో జీటీ సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Infinix GT 20 Pro పేరుతో వస్తోన్న ఈ ఫోన్ మే 21న భారత్ లో లాంచ్ అవ్వనుంది. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ధర భారత్ లో రూ.25,000 లోపు ఉంటుందని కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. గేమర్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొస్తున్నారు. సైబర్ మెకా డిజైన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. ఓసారి Infinix GT 20 Pro ధర వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Infinix GT 20 Pro ధర
రూ.25,000 లోపు ధరలో అత్యంత శక్తివంతమైన గేమింగ్ స్మార్ట్‌ఫోన్ గా Infinix GT 20 Pro నిలవనుందని ఇన్ఫినిక్స్ చెబుతోంది. భారత్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా Infinix GT 20 Pro సేల్ ఉంటుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ లో Infinix GT 20 Pro మైక్రో-సైట్ దర్శనమిస్తోంది. దీని ద్వారా హ్యాండ్సెట్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ గా గత నెలలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్, 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది.
Baaki ke features 21st May ko! ?
Imagine. All of these amazing features under 25k ?
Dekha admin aap sab se kitna pyaar karta hai! ?#GTverse #GT20Pro pic.twitter.com/Y6bTnt22g8
— Infinix India (@InfinixIndia) May 15, 2024
Infinix GT 20 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Infinix GT 20 Pro 5జీ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పిక్సెల్‌వర్క్స్ ఎక్స్5 టర్బో గేమింగ్ డిస్ప్లే చిప్సెట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Infinix GT 20 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ వినియోగించారు.
ర్యామ్, స్టోరేజీ: Infinix GT 20 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.
ఓఎస్: Infinix GT 20 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Infinix GT 20 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ శాంసంగ్ హెచ్ఎమ్6 మెయిన్ సెన్సర్, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో కెమెరా (మినీ ఎల్ఈడీతో) ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Infinix GT 20 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Infinix GT 20 Pro లో ఐపీ54 స్ప్లాష్ మరియు డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్‌ని కలిగి ఉంది.











