Home News Infinix GT సిరీస్ లాంచ్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ; ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, ఎల్ఈడీ లైట్ తో వస్తోన్న లైనప్!

Infinix GT సిరీస్ లాంచ్‌ని కన్ఫర్మ్ చేసిన కంపెనీ; ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్, ఎల్ఈడీ లైట్ తో వస్తోన్న లైనప్!

Highlights
  • తాజాగా ప్రత్యక్షమైన Infinix GT సిరీస్ టీజర్ వీడియో
  • ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోన్న డివైజ్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ డివైజ్ లో ఉండే చాన్స్

స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix తన తదుపరి లైనప్ Infinix GT సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే, డివైజ్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. దీనికి తోడు, ఎల్ఈడీ లైట్స్ కూడా ఉండనున్నాయి. అంటే మనం ఇదివరకు చూసిన నథింగ్ ఫోన్ డిజైన్ మాదిరిగానే Infinix GT సిరీస్ డిజైన్ ఉండబోతోంది. అతి త్వరలో Infinix GT సిరీస్ మార్కెట్ లోకి రానుంది. సరే, ఓసారి Infinix GT సిరీస్ విశేషాలేంటో తెలుసుకుందాం.

Infinix GT సిరీస్

ఇన్ఫినిక్స్ సంస్థ తన భారతదేశపు సోషల్ మీడియా హ్యాండిల్ పై Infinix GT సిరీస్ లాంచ్ ని ఖరారు చేసింది.

Infinix GT 10 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

గత కొన్ని రోజులుగా, Infinix GT సిరీస్ కొత్త లీక్స్ హడావుడి చేస్తున్నాయి. సరే, ఓసారి Infinix GT 10 Pro 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.