హైలైట్స్
- గత నెలలో భారత్ లో లాంచైన Infinix Hot 20 5G
- కేవలం 4జిబి + 64జిబి ఆప్షన్ తో లాంచైన Infinix Hot 20 5G
- ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్
Infinix Hot 20 5G ప్రస్తుతం 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధర రూ.12,479 తో ప్రారంభమవుతుంది. జనవరి 15 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. సిటి మరియు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఈ ఫోన్ కొనుగోలుపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని పొందవచ్చు.
Infinix Hot 20 5G స్పెసిఫికేషన్స్
- MediaTek Dimensity 810 చిప్సెట్
- 6.6-inch FHD+ 120Hz డిస్ప్లే
- LCD ప్యానెల్
- సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
- 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
- 8ఎంపి ఫ్రంట్ కెమెరా
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్
Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఇప్పుడు Infinix Hot 20 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం.
Infinix Hot 20 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 6జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ కలిపి మొత్తం 11జిబి ర్యామ్ యూజర్ కి లభిస్తుంది. ఇకపోతే 128జిబి ఆన్‌బోర్డ్ స్టోరేజీ, ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఈ ఫోన్ లో ఉంటాయి. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్ 5.1, వై-ఫై మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.
Infinix Hot 20 5G ధర
Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,479 గా నిర్ణయించారు. జనవరి 15 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. సిటి మరియు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్స్ ఈ ఫోన్ కొనుగోలుపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని పొందవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.