Home News 6000mAh బ్యాటరీ, 16GB ర్యామ్ తో జులై 14 న లాంచ్ కానున్న Infinix Hot 30 5G

6000mAh బ్యాటరీ, 16GB ర్యామ్ తో జులై 14 న లాంచ్ కానున్న Infinix Hot 30 5G

Highlights
  • రూ.15,000 లోపు ధరలో లాంచ్ కానున్న Infinix Hot 30 5G
  • 14 5జీ బ్యాండ్స్ తో రానున్న Infinix Hot 30 5G
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి రానున్న స్మార్ట్ ఫోన్

భారతీయ మార్కెట్ లో ఇన్ఫినిక్స్ సంస్థ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Hot 30 5G పేరుతో వస్తోన్న ఈ డివైజ్ జులై 14 న లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. లో-బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Infinix Hot 30 5G ఇండియా లాంచ్

Infinix Hot 30 5G డివైజ్ జులై 14 న భారత్ లో లాంచ్ అవ్వనుందని కంపెనీ ప్రకటించింది. వర్చువల్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా Infinix Hot 30 5G సేల్ కి రానుంది. ఫోన్ లాంచ్ కార్యక్రమాన్ని కంపెనీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా కూడా చూడవచ్చు.

భారత్ లో Infinix Hot 30 5G ధర

లాంచ్ తేదీతో పాటు Infinix Hot 30 5G ధరపై కూడా కంపెనీ నుంచి హింట్ వచ్చింది. రూ.15,000 లోపు ధరతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని కంపెనీ తెలిపింది. Infinix Hot 30 5G డివైజ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ మెమొరీ వేరియంట్స్ లో రానుంది. అరోరా బ్లూ, నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Infinix Hot 30 5G స్పెసిఫికేషన్స్