Home News కన్ఫర్మ్ అయిన Infinix Hot 30 లాంచ్ తేదీ: రివీలైన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్

కన్ఫర్మ్ అయిన Infinix Hot 30 లాంచ్ తేదీ: రివీలైన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్

Highlights
  • మార్చి 31 న థాయిలాండ్ లో లాంచ్ అవుతోన్న Infinix Hot 30
  • టీజర్స్ ద్వారా రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫోన్ డిజైన్
  • మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో రానున్న డివైజ్

ఇన్ఫినిక్స్ సంస్థ రీసెంట్ గా Infinix Hot 30i ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు Infinix Hot 30 థాయిలాండ్ లో లాంచ్ అవుతోంది. మార్చి 31 న ఈ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ రిలీజ్ చేసిన టీజర్స్ ద్వారా ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి.

ఇప్పటి వరకు ఇన్ఫినిక్స్ నుంచి రివీలైన టీజర్స్ ద్వారా Infinix Hot 30 6.78-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ వాడినట్లు సమాచారం.

Infinix Hot 30 స్పెసిఫికేషన్స్

Infinix Hot 30 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. టీజర్స్ ద్వారా Infinix Hot 30 డివైజ్ ఫ్రంట్, రియర్ డిజైన్స్ రివీల్ అయ్యాయి. ఈ డివైజ్ పంచ్-హోల్ డిస్ప్లే తో వస్తోంది. పంచ్ హోల్ కటౌట్ లో సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Infinix Hot 30 బాటమ్ లో స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మైక్రోఫోన్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఫోన్ వెనకాల డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.

Infinix Hot 30i స్పెసిఫికేషన్స్

భారత్ లో Infinix Hot 30i ధర రూ.8,999 గా ఉంది. ఈ డివైజ్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పాండా గ్లాస్ ఉంటాయి. హీలియో జీ37 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.