Home News గూగుల్ ప్లే కన్సోల్‌పై కనిపించిన Infinix Hot 30i స్పెసిఫికేషన్స్; మార్చి 27 న లాంచ్ అయ్యే అవకాశం

గూగుల్ ప్లే కన్సోల్‌పై కనిపించిన Infinix Hot 30i స్పెసిఫికేషన్స్; మార్చి 27 న లాంచ్ అయ్యే అవకాశం

Highlights
  • గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Infinix Hot 30i స్మార్ట్ ఫోన్
  • మార్చి 27 న భారత్ లో Infinix Hot 30i డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం
  • 4జిబి ర్యామ్, Spreadtrum చిప్సెట్ తో రానున్న Infinix Hot 30i స్మార్ట్ ఫోన్

Infinix Hot 30i స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 27 న లాంచ్ కానున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ డివైజ్ టీజ్ కాబడుతూ వస్తోంది. కాగా, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో ఈ డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ బయటకు వచ్చాయి. సరే, Infinix Hot 30i యొక్క విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Hot 30i డివైజ్ లిస్టింగ్

గూగుల్ ప్లే కన్సోల్ పై Infinix Hot 30i లిస్ట్ అయ్యింది. Infinix-X669 అనే మోడల్ నంబర్ తో ఈ డివైజ్ కనిపించింది. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 4జిబి ర్యామ్ తో వస్తోంది. ఇది బేస్ వేరియంట్ అని భావిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ Spreadtrum T606 అనే చిప్సెట్ తో వస్తోంది. గూగుల్ ప్లే కన్సోల్ ప్రకారం, ఈ చిప్సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ అని తెలుస్తోంది. ఈ చిప్ కి ఏఆర్ఎం మాలి జీ57 జీపీయూ ని జత చేశారు.

Infinix Hot 30i స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అలాగే వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో ఈ ఫోన్ రానున్నట్లు సమాచారం. ఇకపోతే Infinix Hot 30i డివైజ్ 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్, 320డీపీఐ కి సపోర్ట్ చేస్తుంది.

Infinix Hot 30i స్పెసిఫికేషన్స్

Infinix Hot 30i స్మార్ట్ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ ని ఇన్ఫినిక్స్ సంస్థ టీజ్ చేసింది. దాని ప్రకారం, Infinix Hot 30i డివైజ్ 16జిబి ర్యామ్ తో వస్తోంది. అంటే ఇందులో 8జిబి ఇంటర్నల్ ర్యామ్ మరియు 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటాయి. దీంతో ఫోన్ మరింత వేగంగా పని చేస్తుంది. మల్టీపుల్ యాప్స్ వాడేటప్పుడు ఈ ర్యామ్ చాలా ఉపయోగపడనుంది. అలాగే ఈ ఫోన్ లో 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది.

Infinix Hot 30i లీక్స్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 6.6-ఇంచ్ భారీ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి లీకైన స్పెసిఫికేషన్స్ అని గమనించాలి. త్వరలోనే ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి హాట్ 30ఐ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అఫీషియల్ గా రివీల్ అయ్యే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.