
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలోనే Infinix Hot 40 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Hot 40, Hot 40i ఫోన్లు రానున్నాయి. తక్కువ ధరలోనే ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లు తాజాగా FCC సర్టిఫికేషన్ లిస్టింగ్ పై కనిపించాయి. దీంతో Infinix Hot 40, Infinix Hot 40i ఫోన్లకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Infinix Hot 40 FCC లిస్టింగ్ వివరాలు
- Infinix Hot 40 డివైజ్ ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై 4జీ ఎల్టీఈ సపోర్ట్ తో కనిపించింది.
- ఇంకా ఈ డివైజ్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు లిస్ట్ లో పేర్కొనబడి ఉంది.
- ఎఫ్‌సీసీ లిస్టింగ్ దవ్ారా డివైజ్ యొక్క స్కీమాటిక్స్ కూడా రివీల్ అయ్యాయి. దీంతో ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు తెలిసింది.
- Infinix Hot 40 డివైజ్ స్టార్‌లిట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనున్నట్లు రివీలైన ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
Infinix Hot 40i FCC లిస్టింగ్
- Infinix Hot 40i స్మార్ట్ ఫోన్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై కనిపించింది.
- అంతేకాదు, Infinix Hot 40i డివైజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- ఇంకా త్వరలో రాబోవు రెండు హాట్ 40 సిరీస్ ఫోన్లు 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.
ఇప్పటికైతే, Infinix Hot 40 సిరీస్ డివైజెస్ యొక్క మరే ఇతర స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. కాబట్టి, ఓసారి గత మోడల్ Infinix Hot 30 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Infinix Hot 30 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Infinix Hot 30 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 580 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Hot 30 లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఇదొక ఆక్టా-కోర్ ప్రాసెసర్.
- మెమొరీ: Infinix Hot 30 డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. ఇంకా వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ద్వారా 16జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది.
- కెమెరా: Infinix Hot 30 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ప్రైమరీ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Infinix Hot 30 లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Infinix Hot 30 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Infinix Hot 30 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











