Infinix Hot 40i ఇండియా లాంచ్ తేదీ ఖరారు; ఫ్లిప్‌కార్ట్‌పై కనిపిస్తోన్న మైక్రో-సైట్

Highlights

  • Infinix Hot 40i ఇండియా లాంచ్ ఖరారు
  • ఫ్లిప్‌కార్ట్ లో కనిపిస్తోన్న మైక్రో-సైట్
  • 16జిబి ర్యామ్ పవర్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో భారతీయ మార్కెట్ లో Hot 40i అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. తాజాగా Infinix Hot 40i లాంచ్ తేదీ అధికారికంగా వెల్లడైంది. ఫిబ్రవరి 16న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. 16జిబి వరకు ర్యామ్ పవర్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది.

Infinix Hot 40i లాంచ్ భారత్ తేదీ

  • Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 16న లాంచ్ అవుతోంది.
  • Infinix Hot 40i డివైజ్ యొక్క మైక్రో-సైట్ లాంచ్ కి ముందు ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది.
  • Infinix Hot 40i డివైజ్ 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 16జిబి వరకు ర్యామ్ (8జిబి వర్చువల్ ర్యామ్), మైక్రోఎస్డీ కార్డ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Infinix Hot 40i మైక్రో-సైట్ ద్వారా డ్యూయల్-రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ రివీల్ అయ్యాయి.
  • Infinix Hot 40i డివైజ్ 8జిబి+256జిబి సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అవుతుందని ఒక రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
  • భారత్ లో Infinix Hot 40i డివైజ్ ధర రూ.8,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న తొలి ఫోన్ గా Infinix Hot 40i నిలవనుంది.
  • Infinix Hot 40i స్మార్ట్‌పోన్ 90 హెర్ట్జ్ డిస్ప్లేను ఆఫర్ చేసే అవకాశం ఉంది.
  • Infinix Hot 40i డివైజ్ యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.56-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో 2023 నవంబర్ లో సౌదీ అరేబియాలో లాంచ్ అయ్యింది.

Infinix Hot 40i స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Hot 40i లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix Hot 40i లో యూనిఎస్ఓసీ టీ606 ఆక్టా-కోర్ చిప్సెట్ (1.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్), మాలి-జీ57 జీపీయూ ఉంటాయి.
  • కెమెరా: Infinix Hot 40i లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి ఏఐ లెన్స్, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ: Infinix Hot 40i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Hot 40i లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
Previous articlePOCO: 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచైన POCO X6 5G
Next articleVivo: లీకైన Vivo V30 Pro రెండర్స్, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.