ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో భారతీయ మార్కెట్ లో Hot 40i అనే ఫోన్ ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించిన లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. తాజాగా Infinix Hot 40i లాంచ్ తేదీ అధికారికంగా వెల్లడైంది. ఫిబ్రవరి 16న ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. 16జిబి వరకు ర్యామ్ పవర్, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది.
Infinix Hot 40i లాంచ్ భారత్ తేదీ
- Infinix Hot 40i స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 16న లాంచ్ అవుతోంది.
- Infinix Hot 40i డివైజ్ యొక్క మైక్రో-సైట్ లాంచ్ కి ముందు ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది.
- Infinix Hot 40i డివైజ్ 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 16జిబి వరకు ర్యామ్ (8జిబి వర్చువల్ ర్యామ్), మైక్రోఎస్డీ కార్డ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
- Infinix Hot 40i మైక్రో-సైట్ ద్వారా డ్యూయల్-రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ రివీల్ అయ్యాయి.
- Infinix Hot 40i డివైజ్ 8జిబి+256జిబి సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అవుతుందని ఒక రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
- భారత్ లో Infinix Hot 40i డివైజ్ ధర రూ.8,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోన్న తొలి ఫోన్ గా Infinix Hot 40i నిలవనుంది.
- Infinix Hot 40i స్మార్ట్‌పోన్ 90 హెర్ట్జ్ డిస్ప్లేను ఆఫర్ చేసే అవకాశం ఉంది.
- Infinix Hot 40i డివైజ్ యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.56-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ రెజుల్యూషన్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో 2023 నవంబర్ లో సౌదీ అరేబియాలో లాంచ్ అయ్యింది.
Infinix Hot 40i స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Infinix Hot 40i లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Infinix Hot 40i లో యూనిఎస్ఓసీ టీ606 ఆక్టా-కోర్ చిప్సెట్ (1.6 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్), మాలి-జీ57 జీపీయూ ఉంటాయి.
- కెమెరా: Infinix Hot 40i లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి ఏఐ లెన్స్, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
- బ్యాటరీ: Infinix Hot 40i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Hot 40i లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.
