Infinix సంస్థ డిసెంబర్ 2023 లో Hot 40 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Hot 40, Infinix Hot 40i మరియు Infinix Hot 40 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. 91మొబైల్స్ కి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎక్స్క్లూజివ్ సమాచారం అందింది. త్వరలోనే Infinix Hot 40i భారత్ లో లాంచ్ అవుతుందని తెలిసింది. సరే, ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Infinix Hot 40i ఇండియా లాంచ్
- రిటైల్ వర్గాల నుంచి 91మొబైల్స్ కి Infinix Hot 40 సిరీస్ కి సంబంధించిన లాంచ్ సమాచారం అందింది.
- సిరీస్ లో భాగంగా తొలుత Infinix Hot 40i డివైజ్ కొన్ని రోజుల్లో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది.
- ప్రస్తుతానికి Infinix Hot 40i యొక్క లాంచ్ తేదీ రివీల్ కాలేదు. అయితే ఫిబ్రవరిలోనే లాంచ్ మరియు సేల్ ఉంటుందని తెలుస్తోంది.
Infinix Hot 40i ఇండియా ధర
- భారతీయ మార్కెట్ లో Infinix Hot 40i ధర రూ.9,999 గా ఉంటుందని రిటైల్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
- Infinix Hot 40i 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ని ఆఫర్ చేయనుంది.
- భారత్ లో 256జిబి స్టోరేజీ గల చవకైన స్మార్ట్ఫోన్ల జాబితాలోకి Infinix Hot 40i చేరిపోనుంది.
Infinix Hot 40i స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- డిస్ప్లే: Infinix Hot 40i లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Hot 40i లో యూనిఎస్ఓసీ టీ606 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. దీని క్లాక్ స్పీడ్ 1.6 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 వాడారు.
- ఓఎస్: Infinix Hot 40i స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Infinix Hot 40i లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Infinix Hot 40i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Infinix Hot 40i లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
