Home News Infinix Hot 50 4G: లాంచ్‌కి ముందు లీకైన హాట్ 50 4జీ రెండర్స్, స్పెసిఫికేషన్స్

Infinix Hot 50 4G: లాంచ్‌కి ముందు లీకైన హాట్ 50 4జీ రెండర్స్, స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో Infinix Hot 50 4G విడుదల
  • తాజాగా లీకైన రెండర్ ఇమేజెస్
  • హీలియో జీ100 ప్రాసెసర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో Hot 50 4G ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే, 5జీ వేరియంట్ లాంచ్ అయ్యింది. లేటెస్ట్ లీక్ ద్వారా రెండర్స్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. చూడటానికి డివైజ్, 5జీ వేరియంట్ లాగానే ఉంది. అయితే స్పెసిఫికేషన్స్ వేరుగా ఉన్నాయి. సరే, ఓసారి లీకైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Infinix Hot 50 4G డిజైన్ (లీక్)

Infinix Hot 50 4G స్మార్ట్‌ఫోన్‌ చూడటానికి 5జీ వర్షన్ మాదిరే ఉంది. ఫోన్ ముందువైపు గమనిస్తే, పంచ్ హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ మరియు సన్నని బెజెల్స్ ఉన్నాయి.

డివైజ్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.

Infinix Hot 50 4G యొక్క బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. ఈ ఫోన్ బాక్సీ చాసిస్, రౌండెడ్ ఎడ్జెస్ కలిగి ఉంది.

Infinix Hot 50 4G డివైజ్ బ్లాక్, గ్రీన్ మరియు గోల్డ్/బీజ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీకైన రెండర్స్ ద్వారా తెలుస్తోంది.

Infinix Hot 50 4G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: లీక్ ప్రకారం, Infinix Hot 50 4G లో 6.78-ఇంచ్ భారీ స్క్రీన్, ఐపీఎస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Infinix Hot 50 4G లో మీడియాటెక్ హీలియో జీ100 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. 5జీ మోడల్ లో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వాడారు.

కెమెరా: Infinix Hot 50 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

బ్యాటరీ: Infinix Hot 50 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Hot 50 4G ధర (అంచనా)

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరతో లాంచ్ అయ్యింది. కాబట్టి, 4జీ వేరియంట్ దీనికంటే తక్కువ ధరలో రూ.7,000 నుంచి రూ.8,000 మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 60Hz, 90Hz, 120Hz రిఫ్రెష్ రేట్స్, 93.9 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Hot 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Infinix Hot 50 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ముందువైపు కూడా ఫ్లాష్ అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Infinix Hot 50 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Infinix Hot 50 5G లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా డైనమిక్ బార్ ఇంటరాక్టివ్ స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ సెగ్మెంట్-ఫస్ట్ టీయూవీ ఎస్‌యూడీ ఏ లెవెల్ 60-మంత్ ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో వచ్చింది. ఐదేళ్ళ పాటు ఈ ఫోన్ నిలకడగా పని చేస్తుందని దీనర్థం.