
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix రేపు భారతీయ మార్కెట్ లో Infinix Hot 50 5G అనే డివైజ్‌ను లాంచ్ చేయనుంది. అయితే ఈలోపే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ధర, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ లపై ఇప్పటికే ఈ ఫోన్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తోంది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 7.8ఎంఎం మందం, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైమెన్సిటీ 6300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి రివీలైన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Infinix Hot 50 5G ధర
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎక్స్‌జివ్‌గా సేల్‌కి వస్తోంది. దీని ధరను రూ.9,999 లోపు ఉంటుందని సమాచారం. గత రిపోర్ట్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క బేస్ వేరియంట్ ధర ఆఫర్ తో కలిపి రూ.9 వేల లోపు ఉండవచ్చని తెలుస్తోంది.
Infinix Hot 50 5G డిజైన్, కలర్స్
Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ, గ్రీన్ మరియు డార్క్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్ కలిగి కొత్త డిజైన్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందువైపు చూస్తే, పంచ్ హోల్ నాచ్ కటౌట్ ఉంది. సెగ్మెంట్ లో సన్నని 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఈ డివైజ్ 7.8 మి.మీ మందం ఉంటుంది. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.
Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Infinix Hot 50 5G లో 6.5-ఇంచ్ స్క్రీన్, 90 హెర్ట్జ్ – 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
చిప్సెట్: Infinix Hot 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50 5G డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ వల్లన యూజర్‌కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Infinix Hot 50 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఏయే మెగాపిక్సెల్స్ ఉన్న కెమెరాలు ఉంటాయో ఇంకా తెలియదు.
బ్యాటరీ: Infinix Hot 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
సాఫ్ట్‌వేర్: Infinix Hot 50 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.
కనెక్టివిటీ: Infinix Hot 50 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
ఇతర ఫీచర్లు: Infinix Hot 50 5G డివైజ్ సెగ్మెంట్ లో తొలిసారిగా టీయూవీ ఎస్‌యూడీ ఏ లెవెల్ 60-మంత్ ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో వస్తోంది. అంటే ఈ ఫోన్ 5 ఏళ్ళ పాటు శక్తివంతంగా పని చేస్తుంది.











