చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో తన హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఇన్ఫినిక్స్ సంస్థ హాట్ 50 5జీ యొక్క ఇండియా లాంచ్ తేదీ, డిజైన్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్‌ను షేర్ చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరతో లాంచ్ అవుతుందని అంచనా. సరే, ఓసారి లాంచ్ తేదీ, లుక్ మరియు ఫీచర్లు తెలుసుకుందాం.
Infinix Hot 50 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
కంపెనీ వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, Infinix Hot 50 5G సెప్టెంబర్ 6న లాంచ్ అవుతోంది.
ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ 7.8 మి.మీ మందంతో వస్తోంది. ఈ స్లిమ్ డిజైన్ కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది.
5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మంట్ లోనే Infinix Hot 50 5G అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ చెబుతోంది.
Infinix Hot 50 5G డిజైన్
Infinix Hot 50 5G డిజైన్ గురించి మాట్లాడితే, బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందువైపు పంచ్ హోల్ నాచ్ ఉంది. ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. టీజర్ లో కనిపించిన ఫోన్ బ్లూ మరియు గ్రీన్ కలర్స్ లో ఉంది. గత మోడల్ కంటే ఈ ఫోన్ డిఫరెంట్ లుక్ తో రానున్నట్లు అర్థమవుతోంది.
Infinix Hot 50 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
ప్రాసెసర్: Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది. మల్టీటాస్కింగ్, ఫాస్ట్ కనెక్టివిటీకి ఈ చిప్సెట్ సరిపోతుంది.
ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50 5G డివైజ్ 128జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 4జిబి/8జిబి ర్యామ్ ఆఫర్ చేస్తుంది.
బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా చార్జింగ్ స్పీడ్ వివరాలు తెలియలేదు.
సెగ్మెంట్ లో తొలిసారిగా, టీయూవీ ఎస్‌యూడీ ఏ-లెవెల్ 60-నెలల ఫ్లూయెన్సీ అస్యూరెన్స్ తో Infinix Hot 50 5G వస్తోంది. ఈ ఫోన్ 5 ఏళ్ళ పాటు శక్తివంతంగా పని చేస్తుందని ఈ సర్టిఫికేషన్ ద్వారా అర్థమవుతోంది.
