Home News Infinix Hot 50 Pro Plus టీజర్ విడుదల, త్వరలో గ్లోబల్‌గా లాంచ్

Infinix Hot 50 Pro Plus టీజర్ విడుదల, త్వరలో గ్లోబల్‌గా లాంచ్

Highlights
  • త్వరలో Infinix Hot 50 Pro Plus విడుదల
  • తాజాగా టీజర్‌ రిలీజ్ చేసిన కంపెనీ
  • స్లిమ్మెస్ట్ లుక్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ 50 సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix Hot 50 Pro Plus పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా కంపెనీ ఈ ఫోన్ యొక్క టీజర్‌ను గ్లోబల్ గా విడుదల చేసింది. అఫీషియల్ టీజర్ లో, హాట్ 50 ప్రో ప్లస్ 6.8 మి.మీ మందం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. సరే, ఓసారి ఈ ఫోన్ టీజర్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

Infinix Hot 50 Pro Plus గ్లోబల్ టీజర్

Infinix Hot 50 Pro Plus స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను ఫిలిప్పైన్స్ దేశంలో ఇన్ఫినిక్స్ టీజ్ చేయడం ప్రారంభించింది.

ఈ ఫోన్ అత్యంత సన్నని డిజైన్ తో రాబోతున్నట్లు తాజాగా విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తోంది.

బ్రాండ్ ప్రకారం, ఈ ఫోన్ 6.8 మి.మీ మందం ఉంటుందని అర్థమవుతోంది. అందుకే ఈ ఫోన్‌ని ప్రపంచపు అత్యంత సన్నని ఫోన్ అని కంపెనీ చెబుతోంది.

Infinix Hot 50 Pro Plus స్పెసిఫికేషన్స్

Infinix Hot 50 Pro Plus లాంచ్ టైమ్‌లైన్ మరియు ధర (అంచనా)

Infinix Hot 50 Pro Plus స్మార్ట్‌ఫోన్ ఫిలిప్పైన్స్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో టీజర్ లో పేర్కొనలేదు. అయితే త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ ఫోన్ భారత్ లో కూడా విడుదలవుతుందని సమాచారం. ఇండియా లాంచ్‌కి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

Infinix Hot 50 Pro Plus ధర విషయానికి వస్తే, స్పెసిఫికేషన్స్ ను గమనిస్తే, ఫోన్ ధర రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉండే అవకాశం ఉంది.