హైలైట్స్:
- ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ లో 5 వ ఎడిషన్ గా లాంచ్ అయిన Infinix Note 12 Pro
- 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 108 ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- భారత్ లో Infinix Note 12 Pro ధర రూ.16,999
Infinix Note 12 Pro భారత్ లో లాంచ్ అయ్యింది. మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ని ఈ ఫోన్లో అమర్చారు. ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ లో Infinix Note 12 Pro ఐదవ ఎడిషన్. ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ ఇన్ఫినిక్ నోట్ 12, ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బో, ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 12 5జీ వేరియంట్ ఉన్నాయి. గత నెలలో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జీ యొక్క డౌన్‌గ్రేడ్ వర్షన్ Infinix Note 12 Pro.
బాక్సీ డిజైన్, ఫ్లాట్ బ్యాక్, 7.8 ఎంఎం మందం తో ఉన్న Infinix Note 12 Pro 192 గ్రాములు బరువు ఉంటుంది. ఫోన్ ప్రొటెక్టివ్ స్క్రీన్ గార్డ్ తో వస్తోంది. మరి భారత్ లో Infinix Note 12 Pro యొక్క ధర, విక్రయ తేదీ, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను తెలుసుకుందాం పదండి.
భారత్ లో Infinix Note 12 Pro ధర, సేల్ వివరాలు
Infinix Note 12 Pro 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కలిగిన ఒకే వేరియంట్ లో వస్తోంది. ఇక ఈ వేరియంట్ ధర రూ.16,999. Infinix Note 12 Pro మూడు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: వాల్కనిక్ గ్రే, టస్కనీ బ్లూ, ఆల్పైన్ వైట్.
Infinix Note 12 Pro పై ఆసక్తికలిగిన కొనుగోలుదారులు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. అయితే ఫోన్ చేతికి చేరాలంటే సెప్టెంబర్ 1 వరకు ఆగాల్సిందే. డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ద్వారా Infinix Note 12 Pro కొనుగోలు పై రూ.1500 డిస్కౌంట్ లభించనుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ద్వారా రూ.500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Infinix Note 12 Pro స్పెసిఫికేషన్స్
మీడియాటెక్ హీలియో జీ99 చిప్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ Infinix Note 12 Pro. ఈ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 5జిబి వర్చువల్ ర్యామ్, 2టీబీ మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
Infinix Note 12 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ, 2ఎంపి డెప్త్, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపు 16ఎంపి కెమెరా ఉంది. Infinix Note 12 Pro ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. డీటీఎస్ సరౌండ్ సపోర్ట్ తో కూడిన రెండు స్పీకర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ బాక్స్ లో చార్జర్ తో వస్తోంది.