
ఇన్ఫినిక్స్ సంస్థ త్వరలోనే భారత మార్కెట్ లో Infinix Note 12i ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. జనవరి 25 న ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. అయితే లాంచ్ కి ముందు Infinix Note 12i ఫోన్ యొక్క మైక్రో-సైట్ ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యక్షమైంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.
మైక్రోసైట్ లో మెన్షన్ చేసిన వివరాలను బట్టి ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే తో వస్తున్నట్లు స్పష్టమైంది. సరే, ఓసారి Infinix Note 12i యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Infinix Note 12i స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 6.7-ఇంచ్ డిస్ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోంది. Infinix Note 12i వైడ్వైన్ ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తున్నట్లు మైక్రోసైట్ ద్వారా రివీల్ అయ్యింది. ఎల్1 సర్టిఫికేషన్ తో వస్తుండటంతో, యూజర్లు నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ కంటెంట్ ని బెటర్ రెజుల్యూషన్ తో చూడవచ్చు.
Infinix Note 12i స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ52 జీపీయూ వినియోగించారు. ఇండియన్ వేరియంట్ లో 4జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్ ని అందించారు. గ్లోబల్ మార్కెట్స్ లో 64జిబి స్టోరేజీ వేరియంట్ అందించారు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇప్పుడు Infinix Note 12i యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, క్యూవీజీఏ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి కెమెరా ఉంటుంది.
Infinix Note 12i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్ సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. Infinix Note 12i స్మార్ట్ ఫోన్ వైట్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 7.8 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











