Infinix Note 30 5G జూన్ మూడో వారంలో లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ జెబిఎల్-పవర్డ్ స్టీరియో సరౌండ్ సౌండ్ ఫీచర్ తో రానుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇంకా ఈ డివైజ్ 108ఎంపి హై-రెజుల్యూషన్ కెమెరాతో వస్తోందని కంపెనీ తెలిపింది. Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ సినిమాటిక్ ఫ్లెయిర్, సూపర్ నైట్ మోడ్ ఫీచర్స్ తో వస్తోంది. Infinix Note 20 5G కి సక్సెసర్ గా Infinix Note 30 5G మార్కెట్ లోకి రానుంది.
Infinix Note 30 5G డిజైన్
- Infinix Note 30 5G లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. చూడటానికి ఎంతో ప్రీమియమ్ గా ఆరెంజ్ కలర్ లో డివైజ్ కనిపిస్తోంది.
- ఫోన్ కి ఎడమవైపున సిమ్ ట్రే సెక్షన్ ఉంది.
- డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై రెక్టాంగ్యులర్ మాడ్యూల్, డ్యూయల్ సర్క్యులర్ రింగ్స్, ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
- Infinix Note 30 5G అల్యూమినియమ్ ఫ్రేమ్ తో కనిపిస్తోంది. ఇది గోల్డ్ కలర్ లో ఉంది.
- ఫోన్ ముందు వైపు డిజైన్ ఇంకా రివీల్ కాలేదు. అయితే, పంచ్-హోల్ కటౌట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Infinix Note 30 5G ఫీచర్స్
- Infinix Note 30 5G డివైజ్ జెబిఎల్ స్పీకర్స్ తో వస్తోంది. దీనిలోని డిస్టార్షన్-ఫ్రీ వాల్యూమ్, డీపర్ బేస్, జెబిఎల్ యొక్క సిగ్నేచర్ సౌండ్ ని యూజర్లు ఎంజాయ్ చేయవచ్చు.
- కెమెరాల విషయానికి వస్తే, Infinix Note 30 5G లో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా డ్యూయల్-వ్యూ ఫీచర్ తో వస్తున్నట్లు సమాచారం. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.
- లీక్ ప్రకారం, Infinix Note 30 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ తో రానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ 8 GB RAM, 256 GB స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. ఇతర మెమొరీ వేరియంట్స్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే చాన్స్ ఉంది. వాటి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.
- Infinix Note 30 5G ఫోన్ లో 6.78-అంగుళాల పంచ్-హోల్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ స్పెసిఫికేషన్స్ పై మరింత స్పష్టత రానుంది.
-
Infinix Note 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 mAh బ్యాటరీని అందించవచ్చని అంచనా. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. లీకైన ఇమేజ్ ని చూస్తే, ఈ ఫోన్ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ డివైజ్ లో అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
