108MP కెమెరా, 8GB వర్చువల్ ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Infinix Note 30 5G

Highlights

  • భారత్ లో లాంచైన Infinix Note 30 5G
  • జేబీఎల్ సరౌండ్ డ్యూయల్ స్పీకర్స్ తో వచ్చిన డివైజ్
  • భారత్ లో Infinix Note 30 5G ధర రూ.14,999

ఇన్ఫినిక్స్ సంస్థ నేడు భారతీయ మార్కెట్ లో Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన మిడ్ రేంజ్ డివైజ్. ఈ స్మార్ట్ పోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ ధర, ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. ఇది కూడా చదవండి: డెయిలీ 2జిబి డేటా అందించే Jio రీచార్జ్ ప్లాన్స్

Infinix Note 30 5G ధర

భారత మార్కెట్ లో Infinix Note 30 5G డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటిలో 128జిబి, 4జిబి ర్యామ్ వేరియంట్, 8జిబి+256జిబి వేరియంట్ ఉన్నాయి. వీటి ధరలు వరుసగా, రూ.14,999 మరియు రూ.15,999 గా ఉన్నాయి. Infinix Note 30 5G డివైజ్ జూన్ 22 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఇంటర్‌స్టెల్లర్ బ్లూ, మ్యాజిక్ బ్లాక్ మరియు సన్సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Note 30 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Note 30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఐకేర్ మోడ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Note 30 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు.
  • ఓఎస్, మెమొరీ: Infinix Note 30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఇంటర్నల్ ర్యామ్ ఉన్నాయి. అంటే యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభించనుంది. 4జిబి ర్యామ్ వేరియంట్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ లభిస్తుంది.
  • కెమెరా: Infinix Note 30 5G స్మార్ట్ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Infinix Note 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. దీన్ని 10,000 కంటే ఎక్కువసార్లు చార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ మొబైల్ ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. దీంతో ఫోన్, అర గంటలో 75 శాతం చార్జ్ అవుతుంది. 10 వాట్ రివర్స్ చార్జింగ్ కి కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Note 30 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఐపీ53 రేటింగ్ కూడా ఉంది. ఇంకా ఎన్ఎఫ్‌సీ, జెబిఎల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.