ఇన్ఫినిక్స్ బ్రాండ్ తన ‘నోట్’ సిరీస్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తోంది, ఇది Infinix Note 30 5G పేరుతో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ మొబైల్‌కు సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ ఇంకా ఇవ్వనప్పటికీ, టిప్‌స్టర్ పారస్ గుగ్లానీ లాంచ్‌కు ముందే ఇన్ఫినిక్స్ నోట్ 30 5G యొక్క స్పెసిఫికేషన్స్ ని పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.
Infinix Note 30 5G లాంచ్ వివరాలు
Infinix Note 30 5Gకి సంబంధించిన లీక్ ద్వారా లాంచ్ తేదీ బయటకు వచ్చింది. దాని ప్రకారం, కంపెనీ మే 30వ తేదీన జరిగే ఆన్‌లైన్ ఈవెంట్ లో ఫోన్ ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ సమాచారం పోస్టర్ ద్వారా వెల్లడైంది కానీ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కంపెనీ నుంచి అధికార ప్రకటన వస్తే గాని లాంచ్ తేదీపై స్పష్టత రాదు. లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించిన వెంటనే ఆ వివరాలను మీకోసం అందజేస్తాం. ఇప్పుడు లీకైన Infinix Note 30 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Infinix Note 30 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే
- 6.78″ FHD+ స్క్రీన్
- 120Hz రిఫ్రెష్ రేట్
Infinix Note 30 5G ఫోన్ లో 6.78-అంగుళాల పంచ్-హోల్ డిస్‌ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది.
చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ
- మీడియాటెక్ డైమెన్సిటీ 6080
- 8GB RAM + 256GB స్టోరేజీ
లీక్ ప్రకారం, Infinix Note 30 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ తో రానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8 GB RAM, 256 GB స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది. ఇతర మెమొరీ వేరియంట్స్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే చాన్స్ ఉంది. వాటి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.
కెమెరా విభాగం
- 108MP వెనుక కెమెరా
- 16MP ఫ్రంట్ కెమెరా
ఫోటోగ్రఫీ కోసం ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీనితో 2 మెగాపిక్సెల్స్ కెమెరా మరియు AI లెన్స్ కూడా ఉంటాయని సమాచారం. అదే విధంగా సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.
బ్యాటరీ, చార్జింగ్
- 5,000mAh బ్యాటరీ
- 33W ఫాస్ట్ ఛార్జింగ్
Infinix Note 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 mAh బ్యాటరీని అందించవచ్చని అంచనా. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. లీకైన ఇమేజ్ ని చూస్తే, ఈ ఫోన్ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ డివైజ్ లో అన్ని బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
