ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో నోట్ సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix Note 40 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 21వ తేదీన భారత్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇప్పటికే ఈ డివైజ్ గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. ఓసారి ఇండియా లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Infinix Note 40 5G ఇండియా లాంచ్ తేదీ
Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X ద్వారా రివీల్ చేసింది.
టీజర్ ఇమేజ్‌ని గమనిస్తే, Infinix Note 40 5G ఫోన్ జూన్ 21న భారత్ లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్, సెంటర్డ్ పంచ్-హోల్ నాచ్ డిస్ప్లే తో లాంచ్ కానుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
Infinix Note 40 5G డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇంకా యాక్టివ్ హాలో డిజైన్, ఏఐ లైటింగ్ ఉన్నాయి.
Infinix Note 40 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వచ్చే అవకాశం ఉంది.
Infinix Note 40 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
స్క్రీన్: Infinix Note 40 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.
ప్రాసెసర్: Infinix Note 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.
కెమెరా: Infinix Note 40 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: Infinix Note 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్ 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
ఇతర ఫీచర్లు: Infinix Note 40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ53 రేటింగ్, జెబిఎల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి.
