ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ Infinix నేడు గ్లోబల్ గా Infinix Note 40 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Note 40 Pro+ 5G, Infinix Note 40 Pro 5G, Infinix Note 40, Infinix Note 40 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Infinix Note 40 Pro+ 5G మరియు Infinix Note 40 Pro 5G డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.
Infinix Note 40 Pro 5G ధర
Infinix Note 40 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వచ్చింది. దీని ధర 289 డాలర్లు (సుమారు రూ.23,900) గా ఉంది.
Infinix Note 40 Pro+ 5G స్మార్ట్ఫోన్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ + 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధర 309 డాలర్లు (సుమారు రూ.25,500) గా ఉంది.
Infinix Note 40 Pro 5G, Note 40 Pro+ 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: రెండు స్మార్ట్ఫోన్లలో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 2436*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ 2160 హెర్ట్జ్ ఉంటాయి.
- ప్రాసెసర్: ఈ రెండు డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ అందించారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
- ఓఎస్: ఈ ఇన్ఫినిక్స్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో వచ్చాయి.
- కెమెరా: Infinix Note 40 Pro+ 5G మరియు Infinix Note 40 Pro 5G డివైజెస్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Infinix Note 40 Pro 5G మరియు Infinix Note 40 Pro+ 5G డివైజెస్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. నోట్ 40 ప్రో 5జీ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: ఈ రెండు ఫోన్లలో ఐపీ53 రేటింగ్, 14 5జీ బ్యాండ్స్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
