Home News Infinix: మ్యాగ్‌ఛార్జ్ వైర్లెస్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Note 40 Pro సిరీస్

Infinix: మ్యాగ్‌ఛార్జ్ వైర్లెస్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Note 40 Pro సిరీస్

Highlights
  • నేడు Infinix Note 40 Pro 5G సిరీస్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన Note 40 Pro 5G, Note 40 Pro+ 5G
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేటి నుంచి సేల్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Note 40 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Note 40 Pro మరియు Note 40 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. బ్యాటరీ కెపాసిటీ మరియు చార్జింగ్ సపోర్ట్ విషయాల్లో తప్పా మిగతా అన్నింట్లో రెండు ఫోన్లు ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. ఆపిల్ యొక్క మ్యాగ్‌సేఫ్ వంటి మ్యాగ్‌ఛార్జ్ అనే టెక్నాలజీని ఈ ఫోన్లలో ఇన్ఫినిక్స్ అందించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40 Pro సిరీస్ ధర, లభ్యత

Infinix Note 40 Pro సిరీస్ నేటి మధ్యాహ్నం నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎర్లీ బర్డ్ సేల్‌కి అందుబాటులో ఉంటుంది. ఈ ఎర్లీ బర్డ్ సేల్‌లో భాగంగా Note 40 Pro స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,000 విలువగల మ్యాగ్‌కేస్ ని ఉచితంగా అందిస్తోంది. అలాగే రూ.3,999 విలువజేసే మ్యాగ్‌పవర్ 3020mAh పవర్‌బ్యాంక్ ని కూడా ఉచితంగా ఇస్తోంది.

అంతేకాదు, హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్ఫినిక్ సంస్థ 15 వాట్ మ్యాగ్‌ప్యాడ్ చార్జర్ ని రూ.1,999 ధరతో లాంచ్ చేసింది.

Note 40 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.21,999 గా నిర్ణయించారు.

Note 40 Pro+ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

Infinix Note 40 Pro సిరీస్ స్పెసిఫికేషన్స్