Home News Infinix Note 40 Racing Edition: భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ సిరీస్

Infinix Note 40 Racing Edition: భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ సిరీస్

Highlights
  • భారత్‌లో లాంచైన Infinix Note 40 Racing Edition
  • లైనప్‌లో వచ్చిన నోట్ 40 ప్రో, 40 ప్రో ప్లస్
  • సిరీస్ ప్రారంభ ధర రూ.15,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా భారతీయ మార్కెట్ లో Infinix Note 40 Racing Edition సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Infinix Note 40 Pro మరియు Infinix Note 40 Pro Plus రేసింగ్ ఎడిషన్స్ లాంచ్ అయ్యాయి. కంపెనీ యొక్క 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోన్లను ప్రత్యేకమైన డిజైన్‌లో తీసుకొచ్చింది. ఓసారి ఈ ఫోన్ల యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం.

Infinix Note 40 రేసింగ్ ఎడిషన్ ధర, ఆఫర్లు, సేల్ వివరాలు

ఇన్ఫినిక్స్ సంస్థ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ ను భారత్ లో లాంచ్ చేసింది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. నోట్ 40 ప్రో మోడల్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధర రూ.15,999 గా ఉంది. నోట్ 40 ప్రో ప్లస్ 12జిబి+256జిబి వేరియంట్ లో లభిస్తుంది. దీని ధరను రూ.18,999 గా పెట్టారు. ఈ ధర బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని అనే విషయం గమనించాలి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ మొదలైంది.

Infinix Note 40 Racing Edition లో ఉన్న ప్రత్యేకతలేంటి?

బీఎండబ్ల్యూ గ్రూప్ కంపెనీ, డిజైన్ వర్క్స్ తో ఇన్ఫినిక్స్ జట్టుకట్టి, తన నోట్ 40 ప్రో మరియు నోట్ 40 ప్రో లకు కొత్త లుక్ అందించింది.

బ్యాక్ ప్యానెల్ గ్లాసీగా ఉంటుంది. దీన్ని పీసీ+పీఎంఎంఏ (ఆర్గానిక్ గ్లాస్) మెటీరియల్ మరియు యూవీ ట్రాన్స్‌ఫర్ ప్రింటింగ్ ప్రాసెసర్ ద్వారా రూపొందించారు.

బ్యాక్ ప్యానెల్ పై సిల్వర్ కలర్ లో ఇన్ఫినిక్స్ బ్రాండ్ లోగోను గమనించవచ్చు.

రియర్ ప్యానెల్ సెటప్ చూడటానికి నోట్ 40 ప్రో+ మాదిరి ఉంది. కానీ బీఎండబ్ల్యూ కలర్స్ అదనపు ఆకర్షణ.

వాల్‌పేపర్స్, యూఐ, థీమ్స్ మరియు ఐకాన్స్ అనేవి ఈ కొత్త ఎడిషన్ ఫోన్‌కి ప్రత్యేకం. ఇవేకాదు, బీఎండబ్ల్యూ థీమ్డ్ యాక్సెసరీలతో కూడిన కస్టమైజ్డ్ రిటైల్ బాక్స్ లో ఫోన్లు వస్తాయి.

Infinix Note 40 రేసింగ్ ఎడిషన్

డిస్ప్లే: నోట్ 40 ప్రో మరియు నోట్ 40 ప్రో ప్లస్ ఫోన్లలో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.

చిప్సెట్: రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. రెగ్యులర్ ఎడిషన్ మోడల్ లో కూడా ఇదే చిప్సెట్ ఉంది.

కెమెరా: నోట్ 40 ప్రో మరియు నోట్ 40 ప్రో ప్లస్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి + 2ఎంపి లెన్స్‌లు ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Note 40 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ప్రో ప్లస్ మోడల్ లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.