ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix కొన్ని నెలల క్రితం Note 40 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ Note 40 లైనప్ లో కొత్త ఎడిషన్‌ని లాంచ్ చేయబోతోంది. తాజాగా Infinix Note 40 Series Racing Edition లాంచ్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా నోట్ 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ డిజైన్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
Infinix Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ టీజర్
Infinix Note 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ యొక్క వీడియో టీజర్‌ను ఇన్ఫినిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదిక X పై షేర్ చేసింది. వీడియోలో డివైజ్‌ని గమనిస్తే, బీఎండబ్ల్యూ లోగో, ఐకానిక్ ట్రై-కలర్ స్ట్రిప్ కెమెరా మాడ్యూల్ కి పక్కన ఉంది.
అయితే ప్రస్తుతానికి బ్రాండ్ నుంచి డివైజ్‌కి సంబంధించిన లాంచ్ తేదీ వెలువడలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
The countdown begins, we’re about to launch the all-new Infinix NOTE 40 Series Racing Edition. Stay tuned! ? #Infinix #NOTE40Series #RacingEdition #ComingSoon pic.twitter.com/RE4LGJugRG
— Infinix Mobile (@Infinix_Mobile) June 3, 2024
Infinix Note 40 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Infinix Note 40 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ ఎల్టీపీఎస్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1.07 బిలియన్ కలర్ డెప్త్, డీసీఐ-పీ3 వైడ్ కలర్ గ్యామట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి.
ప్రాసెసర్: Infinix Note 40 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం IMG BXM-8-256 జీపీయూ వినియోగించారు.
ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
కెమెరా: Infinix Note 40 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Infinix Note 40 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
ఇతర ఫీచర్లు: Infinix Note 40 5G లో జెబిఎల్ డ్యూయల్ స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్-యాక్సిస్ మోటర్, ఐపీ53 రేటింగ్ ఉన్నాయి.
Infinix Note 40 5G డివైజ్ మ్యాగ్‌కిట్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ కిట్ లో మ్యాగ్నెటిక్ కేస్ ఉంటుంది. దీని ద్వారా 15 వాట్ వైర్లెస్ చార్జర్ ని ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై పెట్టుకోవచ్చు. ఇందుకోసం ఇన్ఫినిక్స్ 3000 ఎంఏహెచ్ ఎక్స్‌టర్నల్ బ్యాటరీ ప్యాక్ అందిస్తోంది.
Infinix Note 40 5G లో చీతా ఎక్స్1 పవర్ మేనేజ్మెంట్ చిప్ కూడా ఉంది. ఈ చిప్ బ్యాటరీ టెంపరేచర్ మరియు వొల్టేజీని గమనిస్తుంటుంది. దీంతో ఫాస్ట్ అండ్ సేఫ్ చార్జింగ్ సాధ్యమవుతుంది.
