
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో నోట్ 40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Note 40x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ఆగస్టు 5వ తేదీన లాంచ్ కాబోతుందని ఇన్ఫినిక్స్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇకపోతే, ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 108ఎంపి కెమెరాతో లాంచ్ కానుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Infinix Note 40x 5G ఇండియా లాంచ్ తేదీ
Infinix Note 40x 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 5వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ అదే రోజున వెల్లడవుతాయి. ఈ ఫోన్ కి సంబంధించిన ప్రత్యక్షప్రసారాన్ని ఇన్ఫినిక్స్ ఇండియా వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ మరియు యూట్యూబ్ చానల్స్ పై చూడవచ్చు.

Infinix Note 40x 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)
Infinix Note 40x 5G స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
Infinix Note 40x 5G ఒకటి కంటే ఎక్కువ మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుంది. టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది.
ఈ ఇన్ఫినిక్స్ డివైజ్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ తో వస్తోంది.
Infinix Note 40x 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
స్క్రీన్: Infinix Note 40x 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: Infinix Note 40x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తుంది.
సాఫ్ట్‌వేర్: Infinix Note 40x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
మెమొరీ: Infinix Note 40x 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 8జిబి/12జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో వస్తోంది.
కెమెరా: Infinix Note 40x 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, థర్డ్ లైట్ సెన్సర్ ఉంటాయి.
బ్యాటరీ: Infinix Note 40x 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
కనెక్టివిటీ: Infinix Note 40x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.











