
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix ఆగస్టు 5వ తేదీన భారతీయ మార్కెట్ లో ఒక తక్కువ బడ్జెట్ 5జీ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Note 40X 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో విడుదలైంది. మీరు గనుక తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలనుకుంటే Infinix Note 40X 5G మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. నేటి నుంచి భారత్ లో ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. సేల్ వివరాలు, ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Infinix Note 40X 5G ధర
Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.
Infinix Note 40X 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,999 గా పెట్టారు.
Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ లైమ్ గ్రీన్, పామ్ బ్లూ మరియు స్టార్ లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Note 40X 5G ఆఫర్స్
Infinix Note 40X 5G డివైజ్ ను ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే, రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. కనీసం 3 నెలల నుంచి 6 నెలల కాల పరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది.
ఆఫర్ తో కలుపుకుని, Infinix Note 40X 5G బేస్ మోడల్ ను రూ.13,499 కి మరియు టాప్ మోడల్‌ను రూ.14,999 కి కొనుగోలు చేయవచ్చు.
Infinix Note 40X 5G పై ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉన్న ఆఫర్లను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేసి స్వయంగా తెలుసుకోండి.
Infinix Note 40X 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Infinix Note 40X 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, డైనమిక్ బార్ ఇంటరాక్టివ్ యూఐ, పంచ్ హోల్ డిజైన్ ఉన్నాయి.
ప్రాసెసర్: Infinix Note 40X 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.
మెమొరీ: Infinix Note 40X 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Infinix Note 40X 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ ఏఐ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, క్వాడ్ ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Infinix Note 40X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Infinix Note 40X 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Infinix Note 40X 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5, ఓటీజీ, 10 5జీ బ్యాండ్స్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Infinix Note 40X 5G లో భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందించారు.











