Infinix Note 40X 5G: 12GB ర్యామ్, 108MP కెమెరాతో భారత్‌లో లాంచైన ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ

Highlights

  • భారత్‌లో Infinix Note 40X 5G లాంచ్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 12జిబి ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix తన నోట్ 40 సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. Infinix Note 40X 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Infinix Note 40X 5G ధర, లభ్యత

Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Note 40X 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,999 గా పెట్టారు.

Infinix Note 40X 5G డివైజ్ లైమ్ గ్రీన్, పామ్ బ్లూ మరియు స్టార్ లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Note 40X 5G డివైజ్ సేల్ ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ పై మొదలవుతుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Infinix Note 40X 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Infinix Note 40X 5G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, డైనమిక్ బార్ ఇంటెరాక్టివ్ యూఐ మరియు పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Note 40X 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ అందించారు. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Infinix Note 40X 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Infinix Note 40X 5G లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Note 40X 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Infinix Note 40X 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Infinix Note 40X 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.2, ఓటీజీ సపోర్ట్, 10 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.