Infinix Note 40x vs POCO M6 Plus: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెటర్ ఛాయిస్?

    నోట్ 40 ఫ్యామిలీలో Infinix Note 40X ఐదో ఫోన్ గా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ప్రారంభ ధర రూ.14,999 గా ఉంది. ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఇదే సెగ్మెంట్ లో POCO బ్రాండ్ నుంచి M6 Plus అనే ఫోన్ లాంచ్ అయ్యింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ని మరియు పోకో ఎమ్6 ప్లస్ ఫోన్లను పోల్చి చూసి ఏది బెటర్ ఆప్షనో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, ఈ ఆర్టికల్ లో మేం అందిస్తోన్న రెండు ఫోన్ల యొక్క టెస్టింగ్ సమాచారం తెలుసుకొని, ఏది ఉత్తమమైనదో ఒక నిర్దారణకు రండి.

    Infinix Note 40X vs POCO M6 Plus స్పెసిఫికేషన్స్

    Infinix Note 40X

    డిస్ప్లే: 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్.

    డైమెన్షన్స్: 168.9 మి.మీ పొడవు, 76.4 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం.

    బరువు: 201 గ్రాముల బరువు

    సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్

    రియర్ కెమెరా: 108ఎంపి ప్రైమరీ, 2ఎంపి మ్యాక్రో, ఏఐ లెన్స్

    సెల్ఫీ కెమెరా: 8ఎంపి ఫ్రంట్ కెమెరా

    వీడియో: 1080పీ 60ఎఫ్‌పీఎస్

    చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300

    బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్

    స్టోరేజీ: 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ

    కలర్స్: లైమ్ గ్రీన్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్

    POCO M6 Plus

    డిస్ప్లే: 6.79-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్

    డైమెన్షన్స్: 168.6 మి.మీ పొడవు, 76.3 మి.మీ వెడల్పు, 8.3 మి.మీ మందం

    బరువు: 205 గ్రాములు

    సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్

    రియర్ కెమెరా: 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా

    సెల్ఫీ కెమెరా: 13ఎంపి ఫ్రంట్ కెమెరా

    వీడియో: 1080పీ 30ఎఫ్‌పీఎస్

    చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్

    బ్యాటరీ, చార్జింగ్: 5030 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ చార్జింగ్

    స్టోరేజీ: 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ

    కలర్స్: మిస్టీ ల్యావెండర్, ఐస్ సిల్వర్, గ్రాఫైట్ బ్లాక్

    Infinix Note 40X vs POCO M6 Plus: భారత్‌లో ధర

    Infinix Note 40X 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,999

    Infinix Note 40X 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.15,999

    POCO M6 Plus 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,499

    POCO M6 Plus 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.14,499

    Infinix Note 40X vs POCO M6 Plus: డిజైన్

    Infinix Note 40X ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంది. గ్రీన్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రియర్ ప్యానెల్ పై బాటమ్ లో ఎడమ వైపున బ్రాండ్ లోగో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై టాప్ లెఫ్ట్ కార్నర్ లో, స్క్వేర్ ఐల్యాండ్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫ్రంట్ లో పంచ్ హోల్ కటౌట్ డిస్ప్లే ఉంది. POCO M6 Plus లో గ్లాస్ బాడీ, డ్యూయల్-టోన్ ఫినిష్ తో వచ్చింది. పర్పుల్, సిల్వర్ మరియు బ్లాక్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

    Infinix Note 40X vs POCO M6 Plus: డిస్ప్లే

    ఈ రెండు ఫోన్లలో ఫుల్‌హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అయితే పోకో ఎమ్6 ప్లస్ లో కాస్త పెద్ద డిస్ప్లే మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.

    డిస్ప్లే సైజ్ పక్కనబెడితే, పోకో ఎమ్6 ప్లస్ లో ఇచ్చిన గొరిల్లా గ్లాస్ లేయర్ స్క్రీన్‌ను స్క్రాచెస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది తప్పా రెండు ఫోన్లలో ఒకే విధమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.

    Infinix Note 40X vs POCO M6 Plus: పెర్ఫామెన్స్

    POCO M6 Plus స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ చిప్ వాడారు. మరోవైపు Infinix Note 40X లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ వాడారు. ఇక్కడ ఎమ్6 ప్లస్ లో మెరుగైన చిప్సెట్ ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ను ఇంకా మేం టెస్ట్ చేయలేదు. అయితే డైమెన్సిటీ 6300 చిప్ కలిగిన రియల్మీ నార్జో ఎన్65 ను టెస్ట్ చేశాం. మా టెస్టింగ్ సందర్భంగా, ఈ చిప్సెట్ 4,20,659 అంటుటు స్కోర్ చేసింది. అలాగే గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 748 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1941 పాయింట్లు స్కోర్ చేసింది.

    మరోవైపు, POCO M6 Plus అంటుటు పై 4,33,376 పాయింట్లు స్కోర్ చేసింది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 960 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2205 పాయింట్లు నమోదు చేసింది. అయితే Infinix Note 40X విభిన్న ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇది మల్టీ-టాస్కింగ్ విషయంలో ఉపయోగపడుతుంది.

    Infinix Note 40X vs POCO M6 Plus: కెమెరాలు

    POCO M6 Plus లో Infinix Note 40X కంటే మెరుగైన సెల్ఫీ కెమెరా ఉంది. పోకో ఎమ్6 ప్లస్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. రెండు ఫోన్లలోను 108ఎంపి మెయిన్ కెమెరాను అందించారు.

    Infinix Note 40X vs POCO M6 Plus: బ్యాటరీ మరియు చార్జింగ్

    ఈ రెండు ఫోన్లలోని బ్యాటరీ కెపాసిటీల విషయానికి వస్తే, మరీ పెద్దగా మార్పు లేదు. Note 40X లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. M6 Plus లో 5030 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఎమ్6 ప్లస్ 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది. అదే, నోట్ 40ఎక్స్ 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

    మేం జరిపిన పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో, POCO M6 Plus 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు దాదాపు గంట సమయం పట్టింది. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ లో 18 వాట్ చార్జింగ్ కాబట్టి, ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు.

    Infinix Note 40X vs POCO M6 Plus: సాఫ్ట్‌వేర్

    ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యాయి. నోట్ 40ఎక్స్ ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఎమ్6 ప్లస్ హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఓఎస్ అప్డేట్స్ విషయంలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ పై కంపెనీ ఏ ప్రకటన చేయలేదు. మరోవైపు పోకో మాత్రం, తన ఎమ్6 ప్లస్ కు 2 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని తెలిపింది.

    ఏది బెటర్?

    కంపారిజన్ ను ఆధారంగా చేసుకుంటే, రూ.15,000 లోపు బడ్జెట్‌లో POCO M6 Plus బెటర్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్ అని చెప్పవచ్చు. అలాగే ఈ ఫోన్ లో నోట్ 40ఎక్స్ 5జీతో పోల్చితే.. మంచి ప్రాసెసర్, బెస్ట్ సెల్ఫీ కెమెరా, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, భద్రతతో కూడిన డిస్ప్లే ఉన్నాయి.

    అయితే, Infinix Note 40X కూడా తక్కువేం కాదు. ధరను బట్టి, ఈ ఫోన్ కూడా మంచి హార్డ్‌వేర్ ను ఆఫర్ చేస్తోంది. ఇక మీరు, Poco M6 Plus కి బదులుగా Infinix Note 40X ను తీసుకున్నా ఏం డిస్సపాయింట్ అవ్వరు.

    Previous articleRealme 13 5G సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు
    Next articleitel A50, A50C: భారత్‌లో లాంచైన ఐఫోన్ 13 వంటి రెండు కొత్త ఐటెల్ ఫోన్లు
    Shivakishore Bandi
    ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.