
తక్కువ ధరలో ఫోన్లను తీసుకొస్తూ.. యూజర్లలో మంచి పేరు సంపాదించిన Infinix కంపెనీ తాజాగా భారత్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Smart 8 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. సరే, ఓసారి Infinix Smart 8 యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Infinix Smart 8 ధర, సేల్ ఆఫర్స్
- Infinix Smart 8 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
- Infinix Smart 8 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.7,499 గా నిర్ణయించారు.
- Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్ హోల్డర్స్ కి రూ.750 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
- Infinix Smart 8 డివైజ్ ధర ఆఫర్స్ కలుపుకుని రూ.6,749 కి లభించనుంది.
- Infinix Smart 8 డివైజ్ గెలాక్సీ వైట్, రెయిన్‌బో బ్లూ, షైనీ గోల్డ్ మరియు టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Infinix Smart 8 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Infinix Smart 8 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Smart 8 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు.
- ఓఎస్: Infinix Smart 8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 డివైజ్ లో 4జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
- కెమెరా: Infinix Smart 8 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ రింగ్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: Infinix Smart 8 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.











