ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Infinix గ్లోబల్ గా Infinix Smart 8 Plus అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో పాటు Infinix Smart 8 Pro కూడా రెండు రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో మనం Infinix Smart 8 Plus గురించి తెలుసుకుందాం. Infinix Smart 8 Plus స్మార్ట్ఫోన్ 50ఎంపి కెమెరా, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Smart 8 Plus డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Infinix Smart 8 Plus ధర
- Infinix Smart 8 Plus డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ.
- Infinix Smart 8 Plus డివైజ్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
- Infinix Smart 8 Plus స్మార్ట్ఫోన్ టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్ మరియు షైనీ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Infinix Smart 8 Plus స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Infinix Smart 8 Plus లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Smart 8 Plus లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఈ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ రోజువారీ వినియోగానికి బాగా సరిపోతుంది.
- ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 Plus స్మార్ట్ఫోన్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో 4జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: Infinix Smart 8 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ, చార్జింగ్: Infinix Smart 8 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Infinix Smart 8 Plus స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Infinix Smart 8 Plus డివైజ్ 163.65 మి.మీ పొడవు, 75.7 మి.మీ వెడల్పు, 8.95 మి.మీ మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: Infinix Smart 8 Plus లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
