చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Infinix త్వరలో Smart 8 లైనప్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Smart 8 Plus పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. Infinix Smart 8 Plus డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, ఓసారి Infinix Smart 8 Plus ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Infinix Smart 8 Plus ప్రధాన స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Infinix Smart 8 Plus లో 6.6-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్, మ్యాజిక్ రింగ్ ఫీచర్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Smart 8 Plus లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 Plus డివైజ్ లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
- సాఫ్ట్వేర్: Infinix Smart 8 Plus డివైజ్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Infinix Smart 8 Plus లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. క్వాడ్-ఎల్ఈడీ ఫ్లాష్ ని అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ముందువైపు కూడా ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
- బ్యాటరీ: Infinix Smart 8 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Infinix Smart 8 Plus లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, వై-ఫై ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Infinix Smart 8 Plus లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డీటీఎస్ సౌండ్ సపోర్ట్ ఉన్నాయి.
Infinix Smart 8 Plus ధర, లభ్యత
Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర వివరాలు తెలుసుకుందాం.
Infinix Smart 8 Plus డివైజ్ ధరను భారత్ లో రూ.7,779 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పై రూ.800 డిస్కౌంట్‌ని ఇన్ఫినిక్స్ ఆఫర్ చేస్తోంది.
Infinix Smart 8 Plus కొనుగోలుపై యూజర్లు ఎక్స్‌చేంజ్ బోనస్ క్రింద అదనంగా రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు.
Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్‌ని మార్చి 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Infinix Smart 8 Plus డివైజ్ గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్ మరియు టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
