చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Infinix Smart 8 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. 8జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో Infinix Smart 8 Pro లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Infinix Smart 8 Pro పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Infinix Smart 8 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Infinix Smart 8 Pro లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Infinix Smart 8 Pro లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
- ఓఎస్: Infinix Smart 8 Pro స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Infinix Smart 8 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
- బ్యాటరీ: Infinix Smart 8 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Infinix Smart 8 Pro లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- బరువు, మందం: Infinix Smart 8 Pro డివైజ్ 189 గ్రాముల బరువు, 8.5 మి.మీ మందం ఉంటుంది.
Infinix Smart 8 Pro ధర
- Infinix Smart 8 Pro డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
- Infinix Smart 8 Pro ధర 100 డాలర్లు (సుమారు రూ.8,999) వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- Infinix Smart 8 Pro డివైజ్ టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్ మరియు రెయిన్బో బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Infinix Smart 8 Pro రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
