ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix గ్లోబల్‌గా స్మార్ట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Smart 9 పేరుతో వచ్చిన ఈ డివైజ్ మలేషియాలో లాంచ్ అయ్యింది. ఈ ఎంట్రీ లెవెల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ అందించారు. ఈ డివైజ్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Infinix Smart 9 ధర
Infinix Smart 9 డివైజ్ ప్రస్తుతం మలేషియన్ మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీని ధరను 299 రింగిత్ లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో దీన్ని సుమారు రూ.6,200 అని చెప్పవచ్చు. బ్లాక్, మింట్ గ్రీన్, గోల్డ్ మరియు సిల్వర్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ భారత్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి దీనికి సంబంధించి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Infinix Smart 9 స్పెసిఫికేషన్స్
స్క్రీన్: Infinix Smart 9 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90.2% స్క్రీన్-టు-బాడీ రేషియో, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Infinix Smart 9 స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.0 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ52 అందించారు.
ఆపరేటింగ్ సిస్టమ్: Infinix Smart 9 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ గో ఓఎస్ పై పని చేస్తుంది. తక్కువ ర్యామ్ పై పని చేసే గూగుల్ గో యాప్స్ ను డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.
మెమొరీ: Infinix Smart 9 స్మార్ట్‌ఫోన్ 3జిబి/4జిబి ర్యామ్, ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ సాయంతో, గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ పొందవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్ తో మెమొరీని 2టిబి వరకు పెంచుకునే వీలుంది.
కెమెరా: Infinix Smart 9 లో 13ఎంపి రియర్ కెమెరా అందించారు. దీనికి తోడు ఒక డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Infinix Smart 9 స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Infinix Smart 9 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఓటీజీ సపోర్ట్ కూడా ఉంది. దీని ద్వారా యూఎస్బీ పెన్ డ్రైవ్, కీబోర్డ్, మౌజ్ వంటి వాటిని ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు.
ఇతర ఫీచర్లు: Infinix Smart 9 లో ఎఫ్ఎమ్ రేడియో, 300% వాల్యూమ్ ప్లస్ ఫీచర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.
