108mp కెమెరా, 44W చార్జింగ్, 60mp సెల్ఫీ కెమెరాతో లాంచైన Infnix Zero 20

హైలైట్స్

  • నేడు భారత్ లో లాంచైన Infnix Zero 20 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచైన Infnix Zero 20
  • 108ఎంపి మెయిన్ కెమెరా, 60ఎంపి ఫ్రంట్ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణలు

నేడు భారత్ లో Infnix Zero 20 మరియు Infnix Zero Ultra స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అసలైతే ఈ మోడల్స్ గ్లోబల్ గా ఎప్పుడో లాంచ్ అయ్యాయి. అయితే Infnix Zero 20 ఇండియా వేరియంట్ కొన్ని హార్డ్‌వేర్ మార్పులతో వచ్చింది. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా ఫోన్ 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ1 ప్రైమరీ సెన్సర్, 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది.

Infnix Zero 20 స్మార్ట్ ఫోన్ 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రావడం విశేషం. ఇది ఓఐఎస్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. వ్లాగింగ్ చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో లాంచైంది. ఓసారి Infnix Zero 20 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం.

భారత్ లో Infinix Zero 20 ధర, సేల్ వివరాలు

Infnix Zero 20 ధరను రూ.15,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్ గ్రీన్ ఫ్యాంటసీ, గ్లిట్టర్ గోల్డ్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. డిసెంబర్ 25 న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది.

Infnix Zero 20 స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12
  • 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 108ఎంపి + 13ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 60ఎంపి సెల్ఫీలు కెమెరా

Infnix Zero 20 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు. సూపర్ లార్జ్ వీసీ కూలింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

Infnix Zero 20 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Infnix Zero 20 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పనిచేస్తుంది.

Infnix Zero 20 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి అల్ట్రా విజన్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60ఎంపి ఓఐఎస్ ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleలాంచ్ కి ముందు ఫ్లిప్‌కార్ట్ లో దర్శనమిచ్చిన Redmi Note 12 Pro సిరీస్
Next articleమీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ అప్డేట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.