Home News 60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరాతో భారత్‌కి వస్తోన్న Infinix Zero 20; ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన ఫోన్

60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరాతో భారత్‌కి వస్తోన్న Infinix Zero 20; ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన ఫోన్

హైలైట్స్

భారత్ లో ఇన్ఫినిక్స్ కంపెనీ వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లను అందించడం ఇన్ఫినిక్స్ ప్రత్యేకత. ఇప్పుడు ఈ సంస్థ Infinix Zero Ultra మరియు Infinix Zero 20 ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు డివైజ్ లు డిసెంబర్ 20 న లాంచ్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ ద్వారా Infinix Zero 20 లాంచ్ పై స్పష్టత వచ్చింది.

Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ 60 మెగాపిక్సెల్ ఓఐఎస్ సెల్ఫీ కెమెరాతో వస్తుండటం విశేషం. వ్లాగింగ్ చేసే వారికి ఈ కెమెరా చాలా ఉపయోగపడుతుంది. బడ్జెట్ లో మంచి ఫ్రంట్ కెమెరా కలిగిన ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ చాయిస్. అయితే ఇదొక 4జీ డివైజ్. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఓసారి Infinix Zero 20 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Zero 20 స్పెసిఫికేషన్స్

Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఇకపోతే ఈ డివైజ్ యొక్క మేజర్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే 60ఎంపి ఓఐఎస్ ఫ్రంట్ కెమెరా. 60ఎంపి ఓఐఎస్ ఫ్రంట్ కెమెరా ఉన్న ప్రపంచపు తొలి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది.

రియర్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix Zero 20 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో సూపర్ నైట్ మోడ్, 10ఎక్స్ జూమ్, స్కై రీమ్యాపింగ్, ఫిల్మ్ మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి. 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి ఆగ్జిలరీ లెన్స్ ఉంటాయి.

Infinix Zero 20 లో పవర్ బ్యాకప్ కోసం 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Zero 20 డివైజ్ 7.98 మిల్లీ మీటర్ల మందం, 196 గ్రాముల బరువు ఉంటాయి. గ్లిట్టర్ గోల్డ్, స్పేస్ గ్రే, గ్రీన్ ఫాంటసీ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. Infinix Zero 20 లో 11-లేయర్ కూలింగ్ సిస్టమ్, డ్యూయల్ డీటీఎస్ స్పీకర్స్ ఉంటాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Zero 20 ధర

గ్లోబల్ మార్కెట్స్ లో Infinix Zero 20 ధర EUR 300 గా ఉంది. అంటే భారత కరెన్సీలో రూ.26,500. అయితే భారత్ లో ఫోన్ లాంచ్ అయ్యాక ధర లో మార్పు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.