Home News 50MP సెల్ఫీ కెమెరా, 108MP ప్రైమరీ కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Zero 30 5G

50MP సెల్ఫీ కెమెరా, 108MP ప్రైమరీ కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Zero 30 5G

Highlights
  • భారత్ లో Infinix Zero 30 5G ప్రారంభ ధర రూ.23,999
  • ప్రీ-ఆర్డర్ కస్టమర్లకు రూ.2,000 డిస్కౌంట్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix Zero 30 5G సేల్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix భారతీయ మార్కెట్ లో Infinix Zero 30 5G అనే కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి వచ్చే జీరో సిరీస్ ఫోన్లు అద్భుతమైన స్పెసిఫికేషన్స్ తో వస్తాయి. ఈసారి కూడా Infinix Zero 30 5G యూజర్ల అంచనాలకు తగినట్లే ఉంది. Infinix Zero 30 5G లో 21జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉంది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Zero 30 5G డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Infinix Zero 30 5G ధర

Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ గల బేస్ వేరియంట్ ధరను రూ.23,999 గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ గల టాప్ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ రోమ్ గ్రీన్, గోల్డెన్ అవర్ అనే రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లెదర్ బ్యాక్ ఫినిష్ తో వచ్చింది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ రెండు మెమొరీ వేరియంట్స్ పై వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా ఈ డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.

Infinix Zero 30 5G స్పెసిఫికేషన్స్