Home News Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ

Infinix Zero 40 4G: గూగుల్ ప్లే కన్సోల్, టీయూవీ సైట్స్‌పై లిస్టైన జీరో 40 4జీ

Highlights
  • త్వరలో Infinix Zero 40 4G లాంచ్
  • మోడల్ నంబర్ X6860
  • హీలియో జీ99 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో జీరో సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Zero 40 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ తో పాటు, టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీనికంటే ముందే 5జీ మోడల్ కూడా ఈ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. దీంతో రెండు ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.

Infinix Zero 40 4G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Infinix Zero 40 4G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై X6860 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

క్రింద ఇమేజ్ లో Infinix Zero 40 4G పేరుని మీరు గమనించవచ్చు. సర్టిఫికేషన్ ప్రకారం, మీడియాటెక్ హీలియో జీ99 చిప్, మాలి జీ57 జీపీయూ తో ఈ ఫోన్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఇంకా Infinix Zero 40 4G డివైజ్ 1080*2436 పిక్సెల్ రెజుల్యూషన్, 480 పిక్సెల్ డెన్సిటీ తో లిస్ట్ అయ్యింది.

అలాగే గూగుల్ ప్లే కన్సోల్ పై ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

Infinix Zero 40 4G టీయూవీ లిస్టింగ్

Infinix Zero 40 4G డివైజ్ టీయూవీ సర్టిఫికేషన్ సైట్ పై X6860 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే ఫోన్ పేరును ఈ లిస్టింగ్ పై పేర్కొనలేదు.

Infinix Zero 40 4G డివైజ్ 4,900 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు టీయూవీ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Infinix Zero 30 4G లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Infinix Zero 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.

మెమొరీ: Infinix Zero 30 4G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.

కెమెరా: Infinix Zero 30 4G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్, 2ఎంపి థర్డ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Infinix Zero 30 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.