కొన్ని రోజుల క్రితం భారత్ లో Infinix సంస్థ Infinix Note 12i అనే స్మార్ట్ ఫోన్ ని జనవరి 25 న లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. Infinix Zero 5G 2023 ఫోన్ ని కూడా ఇన్ఫినిక్స్ లాంచ్ చేయనుందని తాజా సమాచారం. Infinix Zero 5G 2023 ఫోన్ ఫిబ్రవరి 4 న లాంచ్ కానుందని తాజాగా ఈ సంస్థ ప్రకటించింది. గతేడాది లాంచైన Infinix Zero 5G ఫోన్ కి ఇది సక్సెసర్ గా వస్తోంది.
తన సోషల్ మీడియా చానెల్స్ ద్వారా Infinix కంపెనీ ఫోన్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన చేసింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా Infinix Zero 5G 2023 అమ్ముడవ్వనుంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ పోస్ట్ చేసిన ప్రకటనని చూడండి.
Infinix Zero 5G 2023 ఫోన్ ఇప్పటికే పలు మార్కెట్స్ లో అందుబాటులో ఉండటం వల్లన, ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏంటో తెలిశాయి. ఓసారి Infinix Zero 5G 2023 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.
Infinix Zero 5G 2023: స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర
Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉంటుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ అందించారు. 3.5 ఎంఎం ఆడియో జాక్, హై-రెజ్ ఆడియో సర్టిఫికేషన్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ పర్లీ వైట్, కోరల్ ఆరెంజ్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 168.73 మిల్లీ మీటర్ల పొడవు, 76.53 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.9 మిల్లీ మీటర్ల మందం, 201 గ్రాముల బరువు ఉంటుంది.
Infinix Zero 5G 2023 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 239 డాలర్లు (సుమారు రూ.19,400) గా ఉంటుంది. భారతీయ మార్కెట్ లో కూడా ఈ ఫోన్ ధర రూ.20,000 లోపే ఉండే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
