Home News 120Hz ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, Dimensity 1080 చిప్సెట్ తో లాంచ్ అయిన Infinix ZERO 5G 2023

120Hz ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, Dimensity 1080 చిప్సెట్ తో లాంచ్ అయిన Infinix ZERO 5G 2023

హైలైట్స్

Infinix బ్రాండ్ మెల్లగా తన లైనప్ ని పెంచుకుంటూ పోతోంది. తక్కువ ధరలో చక్కటి ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో కూడిన ఫోన్లను అందిస్తోన్న ఇన్ఫినిక్స్ మార్కెట్ వాటా రోజురోజుకీ పెరుగుతోంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో Infinix ZERO 5G తో జనాల ముందుకు వచ్చిన ఇన్ఫినిక్స్ తాజాగా దీని సక్సెసర్ Infinix ZERO 5G 2023 ని లాంచ్ చేసింది.

Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. కంపెనీ నుంచి ఇది రెండో 5జీ డివైజ్. సింగిల్ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇతర మోడల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. Infinix ZERO 5G 2023 ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix ZERO 5G 2023 స్పెసిఫికేషన్స్

Infinix ZERO 5G 2023 డివైజ్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్షిప్ ఫోన్ అయినప్పటికీ, ఇందులో మిడ్-రేంజ్ స్పెసిఫికేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఫోన్ రియల్మీ 9 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో+ వంటి మోడల్స్ తో పోటీ పడనుంది. అయితే, 2022 మోడల్ తో పోల్చితే 2023 జీరో 5జీ మోడల్ లో పెద్దగా తేడాలు ఏమీ లేవు. అయితే ప్రాసెసర్ మాత్రం కొత్త దాన్ని వాడారు.

Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Infinix ZERO 5G 2023 లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ర్యామ్ ని 5జిబి వరకు పెంచుకునేందుకు ఇందులో RAM ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ఉంది.

Infinix ZERO 5G 2023 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix ZERO 5G 2023 లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. 60FPS 4కే వీడియో రికార్డింగ్, 960FPS స్లో-మో రికార్డింగ్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందించారు.

Infinix ZERO 5G 2023 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix ZERO 5G 2023 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత XOS 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, హై-రెజ్ ఆడియో సర్టిఫికేషన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.

Infinix ZERO 5G 2023 స్మార్ట్ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ ఉంది. n78, n77, n3, n5, n7 వంటి మేజర్ బ్యాండ్స్ తో పాటు ఇంకెన్నో బ్యాండ్స్ కి సపోర్ట్ ఉంది. ఇంకా డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ ఇందులో ఉన్నాయి. పెర్ల్ వైట్, కోరల్ ఆరెంజ్, సబ్‌మరైనర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ ధర, లభ్యతను ఇంకా కంపెనీ వెల్లడించలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.