
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో తన ఫోల్డబుల్ ఫోన్ Zero Flip ను లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫ్లిప్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. అక్టోబర్ 17వ తేదీన ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్లిప్ ఫోన్ల కంటే Infinix Zero Flip యొక్క ధర తక్కువగానే ఉండే అవకాశం ఉంది. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం పదండి.
Infinix Zero Flip ఇండియా లాంచ్ తేదీ
Infinix Zero Flip ఫ్లిప్‌ఫోన్ భారత్‌లో అక్టోబర్ 17వ తేదీన లాంచ్ అవుతోంది. దీనికి సంబంధించి కంపెనీ టీజర్ విడుదల చేసింది. క్రింద ఇవ్వబడిన టీజర్ ఇమేజ్‌ను మీరు చూడవచ్చు.
శాంసంగ్ మరియు మోటోరోలా ఫ్లిప్ ఫోన్లకు ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
Infinix Zero Flip భారతీయ వేరియంట్ స్పెసిఫికేషన్స్, గ్లోబల్ వేరియంట్ మాదిరే ఉంటాయని సమాచారం.
గ్లోబల్ మార్కెట్ లో Infinix Zero Flip ఫ్లిప్ ఫోన్ ధర భారతీయ కరెన్సీ ప్రకారం, రూ.50,100 గా ఉంది. భారత్ లో ఈ ధర మరింత తక్కువగా ఉండనుంది.
Infinix Zero Flip స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
ఇంటర్నల్ డిస్ప్లే: Infinix Zero Flip లో 6.9-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ (1080*2640 పిక్సెల్స్) రెజుల్యూషన్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ఔటర్ డిస్ప్లే: Infinix Zero Flip లో 3.64-ఇంచ్ అమోలెడ్ ఔట్ స్క్రీన్, 1056*1066 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
చిప్సెట్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: Infinix Zero Flip డివైజ్ 16జిబి వరకు ర్యామ్ (ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో కలిపి), 8జిబి స్టాండర్డ్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఫ్రంట్ కెమెరా: Infinix Zero Flip లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి శాంసంగ్ జెఎన్1 ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
రియర్ కెమెరా: Infinix Zero Flip లో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 ఓఐఎస్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు మరియు వెనుకాల కెమెరాలతో 4కే 60ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. వ్లాగింగ్, డీవీ మోడ్, గోప్రో మోడ్ లు ఈ కెమెరాలో ఉన్నాయి.
బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,720 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 10 వాట్ రివర్స్ చార్జింగ్ కూడా ఉంది.
సాఫ్ట్‌వేర్: Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
ఇతర ఫీచర్లు: Infinix Zero Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, జెబిఎల్ డ్యూయల్ స్పీకర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: Infinix Zero Flip డివైజ్ 170.35 మి.మీ పొడవు, 73.4 మి.మీ వెడల్పు, 7.64 మి.మీ మందం ఉంటుంది.












