
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix Zero Flip పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.64-ఇంచ్ అమోలెడ్ సెకండరీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Something extraordinary is coming. A device that flips the script on what a phone can do. Stay tuned for the next chapter in Infinix innovation.
🔥 #Infinix #ZEROFlip #GetINNow pic.twitter.com/ZvSk3mOh7W— Infinix Mobile (@Infinix_Mobile) September 15, 2024
Infinix Zero Flip స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: Infinix Zero Flip లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ ప్రైమరీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.64-ఇంచ్ అమోలెడ్ సెకండరీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటాయి.
ప్రాసెసర్: Infinix Zero Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్.
ర్యామ్, స్టోరేజీ: Infinix Zero Flip డివైజ్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వస్తోంది. 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.
కెమెరా: Infinix Zero Flip లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 10.8ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: Infinix Zero Flip లో పవర్ బ్యాకప్ కోసం 4590 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Infinix Zero Flip డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
Infinix Zero Flip డిజైన్
Infinix Zero Flip స్మార్ట్‌ఫోన్ బ్లాక్ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై భారీ సెకండరీ స్క్రీన్, రెండు కెమెరాలు ఉన్నాయి. ముందువైపు, ఫ్లాట్ డిజైన్ ఉంది. ఈ ఫ్లిప్ ఫోన్ బడ్జెట్ లో బెస్ట్ ప్యాకేజీగా నిలిచే అవకాశం ఉంది.











