హైలైట్స్:
- 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Infinix Zero Ultra 5G
- 200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
- 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 520 డాలర్లు (దాదాపు రూ.42,500)
Infinix కంపెనీ తన కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్ Infinix Zero Ultra 5G ని గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 200ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్, స్టీరియో స్పీకర్స్ సెటప్, కర్వ్డ్ డిస్ప్లే ని కలిగి ఉంది.
రిటైల్ బాక్స్ లో ఫోన్ తో పాటు చార్జర్ ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తోంది. మరి Infinix Zero Ultra 5G యొక్క ధర, ఇతర స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Infinix Zero Ultra 5G ధర
Infinix Zero Ultra 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లభించనుంది. దీని ధర 520 డాలర్లు (సుమారు రూ.42,500).
Infinix Zero Ultra 5G స్పెసిఫికేషన్స్
ఇన్ఫినిక్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ Infinix Zero Ultra 5G లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిస్ప్లే, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ఇకపోతే, Infinix Zero Ultra 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అమర్చారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ వాడారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ని ఈ ఫోన్ కలిగి ఉంది. Infinix Zero Ultra 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత, ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇప్పుడు Infinix Zero Ultra 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 మెగా పిక్సెల్ (ఓఐఎస్) భారీ కెమెరా ఉంది. ఇది 1/1.22-ఇంచ్ సెన్సర్ ని కలిగి ఉంది. 13 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కూడా ఉన్నాయి. వీటికి తోడు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.
Infinix Zero Ultra 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 180 వాట్ థండర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. డేటా ట్రాన్స్‌ఫర్, చార్జింగ్ కోసం ఇందులో టైప్-సీ పోర్ట్ అందించారు. ఈ హ్యాండ్సెట్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ లేదు. భద్రత కోసం ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చారు. Infinix Zero Ultra 5G లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
Infinix Zero Ultra 5G రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: కాస్‌లైట్ సిల్వర్, జెనెసిస్ నొయిర్. కాస్‌లైట్ సిల్వర్ వేరియంట్ 165.50 మిల్లీ మీటర్ల పొడవు, 74.50 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.76 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. జెనెసిస్ నొయిర్ కలర్ వేరియంట్ 165.50 మిల్లీ మీటర్ల పొడవు, 75.08 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.16 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. కాగా Infinix Zero Ultra 5G ఫోన్ బరువు 231 గ్రాములు. Infinix Zero Ultra 5G లో 5జీ, డ్యూయల్-సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, గ్లొనాస్, బైడూ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.