హైలైట్స్
- భారత్ లో నేడు లాంచైన Infinix Zero Ultra 5జీ స్మార్ట్ ఫోన్
- 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 120హెర్ట్జ్ డిస్ప్లే, 200ఎంపి కెమెరా, 180వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన Infinix Zero Ultra
- భారత్ లో Infinix Zero Ultra 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ.29,999
Infinix Zero Ultra మరియు Infinix Zero 20 స్మార్ట్ ఫోన్స్ నేడు భారత్ లో లాంచ్ అయ్యాయి. కంపెనీ ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్, ధర, విక్రయ తేదీలను ప్రకటించింది. అసలైతే ఈ ఫోన్లు అక్టోబర్ నెలలో గ్లోబల్ గా లాచ్ అయ్యాయి. తాజాగా భారతగడ్డపై అడుగు పెట్టాయి. అయితే మార్పు ఏంటంటే, Infinix Zero 20 ఇండియా వేరియంట్ పలు హార్డ్‌వేర్ మార్పులతో వచ్చింది.
ఇప్పుడు మనం Infinix Zero Ultra గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ 200ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ1 ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), 180 వాట్ థండర్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. కేవలం 11 నిమిషాల్లో ఫోన్ వందశాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో వచ్చింది. ఓసారి Infinix Zero Ultra యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
భారత్ లో Infinix Zero Ultra ధర, విక్రయ తేదీ
Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.29,999 గా నిర్ణయించారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా డిసెంబర్ 25 నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కాజ్‌లైట్ సిల్వర్ మరియు జెనెసిస్ నొయిర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Infinix Zero Ultra స్పెసిఫికేషన్స్
Infinix Zero Ultra స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 460 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్ హోల్ కటౌట్ తో వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 6ఎన్ఎం ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ వాడారు. 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
Infinix Zero Ultra లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 180 వాట్ థండర్ చార్జ్ సిస్టమ్ తో వస్తోంది. ఈ థండర్ చార్జ్ సిస్టమ్ 111 సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ని కలిగి ఉండటం చేత ఆప్టిమల్ చార్జింగ్ ని అందించడంతో పాటు, ఓవర్ హీటింగ్ ని నిరోధిస్తుంది.
Infinix Zero Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ భారీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. మెయిన్ సెన్సర్ తో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని డ్యూయల్ ఫ్లాష్ తో అందించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.