హైలైట్స్:
* 180W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* అయితే, 4జీ కనెక్టివిటీ ఉండనున్నట్లు సమాచారం
* ధర రూ.30,000 గా ఉంటుందని అంచనా
Infinix Zero Ultra ఏం ఆఫర్ చేయనుంది?
ఇప్పటికి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి ఎక్కువగా వివరాలేమీ తెలియదు. అయితే 180 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం ఉండనున్నట్లు వినికిడి. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇన్ఫినిక్స్ థండర్ ఛార్జ్ అని పేరు పెట్టింది. జీరో సిరీస్ ఫోన్లలో ఈ మోడల్ ఫోనే అత్యధిక ధరను కలిగి ఉండనుంది.
రిపోర్ట్ ని బట్టి, ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా ఫోన్ లో ఉన్న ఈ థండర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4,500mAh బ్యాటరీని 4 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ ఫోన్ లో 4జీ కనెక్టివిటీ మాత్రమే ఉంటుందని తెలుస్తోంది.
దీన్ని బట్టి ఇన్ఫినిక్స్ అల్ట్రా ఫోన్ పాతతరం చిప్సెట్ తో నడవనుందని అర్థమవుతోంది. లేటెస్ట్ ఫోన్స్ అన్నీ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేసే చిప్సెట్స్ ని కలిగి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్లు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, రిపోర్ట్ ని బట్టి, ఈ ఫోన్ యొక్క ధర రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉంటుందని స్పష్టమవుతోంది.
ధరను బట్టి చూస్తే, జీరో అల్ట్రా ఫోన్.. వన్ ప్లస్ నార్డ్ 2టీ, పోకో ఎఫ్4 5జీ, ఐకూ నియో 5జీ ఫోన్లతో పోటీ పడనుంది. అయితే ఈ మూడు ఫోన్లు కూడా 5జీ కనెక్టివిటీతో పాటు కొత్తతరం చిప్సెట్స్ ని కలిగి ఉన్నాయి. కానీ, ఈ ఫోన్స్ 180W కంటే తక్కువ కెపాసిటీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ నే కలిగి ఉన్నాయి. ఇక్కడే ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా వాటిపై పైచేయి సాధిస్తోంది. త్వరలో భారత గడ్డపై 5జీ సేవలు మొదలు కానున్న తరుణంలో 5జీ కనెక్టివిటీ లేకుండా ప్రీమియమ్ ధరలో వస్తోన్న జీరో అల్ట్రా ఫోన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
ఇప్పటికైతే, ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా ఫోన్ కి సంబంధించిన లాంచ్ తేదీ వివరాలు తెలియదు. కానీ, ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.