అర్జెంటుగా ఎవరికైనా యూపీఐ ద్వారా డబ్బు పంపాలి, కానీ ఇంటర్నెట్ లేదు. ఈ సమస్య మీకు ఎదురైందా? ఇది కచ్చితంగా చిరాకు తెప్పించే సందర్భమే. పేటీఎమ్, ఫోన్‌పే లేదా గూగుల్ పే లేదా మరేదైనా డిజిటల్ వ్యాలెట్ కావొచ్చు. వాటిని అవసరం ఉన్నప్పుడు వాడుకోలేకపోతే తెగ కోపం వచ్చేస్తుంది. కానీ, నేడు మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాం. దాని ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.
ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్ చేయండం ఎలా?
సాధారణంగా యూపీఐ పేమెంట్ కోసం మనం ఏదైనా డిజిటల్ వ్యాలెట్ లేదా యాప్ ని వాడుతాం. కానీ USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లమెంటరీ సర్వీస్ డేటా) ఆధారంగా మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందే విధానాన్ని భారత ప్రభుత్వం మరియు ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీసుకొచ్చాయి. దీని ద్వారా, ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్ చేయవచ్చు. ఆ యూఎస్ఎస్‌డీ కోడ్ ఇదిగో – *99#
ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా?
1. ఆఫ్‌లైన్ యూపీఐ పేమెంట్స్ కోసం తొలుత మీ ఫోన్ లో *99# కి డయల్ చేయాలి.
2. యూఎస్ఎస్‌డీ కోడ్ కి కాల్ చేశాక, మీ మొబైల్ నంబర్ తో జతచేయబడిన బ్యాంకు ఖాతా వివరాలు కనిపిస్తాయి.
3. బ్యాంక్ ఖాతా పేరుతో పాటు, ఈ క్రింద పేర్కొనబడిన ఆప్షన్స్ కనిపిస్తాయి.
- Send Money (డబ్బు పంపు)
- Request Money (డబ్బు కోసం అర్థించు)
- Check Balance (బ్యాలన్స్ చెక్ చేయి)
- My Profile (మై ప్రొఫైల్)
- Pending Request (పెండింగ్ రిక్వెస్ట్)
- Transactions (ట్రాన్సాక్షన్స్)
- UPI PIN (యూపీఐ పిన్)
4. డబ్బు పంపేందుకు తొలుత మొదటి ఆప్షన్ ని 1 నొక్కి ఎంచుకోండి.
5. ఇక్కడ మీకు నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో నుంచి ఒక దానిని ఎంచుకోండి.
- Mobile no. (మొబైల్ నంబర్)
- UPI ID (యూపీఐ ఐడీ)
- Saved Beneficiary (సేవ్ చేసుకున్న ఖాతా)
- IFSC, A/C No. (ఐఎఫ్ఎస్సీ లేదా ఖాతా నంబర్)
6. మీరు గనుక డబ్బుని మొబైల్ నంబర్ కి పంపాలనుకుంటే 1 ని నొక్కండి.
7. ఏ నంబర్ కి ఐతే డబ్బు పంపాలో దానిని ఎంటర్ చేయండి.
8. ఫోన్ నంబర్ టైప్ చేసి, సెండ్ బటన్ నొక్కాక, ఆ నంబర్ వాడే ఓనర్ పేరు కనిపిస్తుంది.
9. ఇక్కడ మీరు పంపాలనుకున్న డబ్బు మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
10. డబ్బుని ఎంటర్ చేశాక, రీమార్క్ ని రాసే అవకాశం ఉంటుంది. ఇందులో మీరు డబ్బులు పంపడానికి గల కారణాన్ని ఎంటర్ చేయవచ్చు.
11. మీకు రీమార్క్ పెట్టడం ఇష్టం లేకపోతే, అప్పుడు 1 తో రిప్లై ఇవ్వండి.
12. ట్రాన్సాక్షన్ వివరాలు మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తాయి. ఇందులో పంపబడిన డబ్బు మొత్తం మరియు మొబైల్ నంబర్ కనిపిస్తాయి.
13. మీకు కనిపించిన వివరాలు సరైనవే అయితే, అప్పుడు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి.
14. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే, మీ ఖాతా నుంచి అవతలి వ్యక్తి ఖాతాలోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది. రిఫరెన్స్ ఐడీతో కూడిన కన్ఫర్మేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
