ప్రముఖ టెక్ బ్రాండ్ Apple నుంచి వచ్చిన iPhone 14 ప్రస్తుతం చవకగా లభిస్తోంది. ఆపిల్ సంస్థ తరచూ తన కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఆఫర్ వచ్చేసింది. ఈసారి iPhone 14 పై రూ.11,500 కి పైగా డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఐఫోన్ 14 తక్కువ ధరకే కస్టమర్లకు లభించనుంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
iPhone 14 డిస్కౌంట్స్, ఆఫర్లు
ఆపిల్ iPhone 14 ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.57,999 కి అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ పై 16 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అంటే వినియోగదారులకు రూ.11,601 వరకు ప్రయోజనం లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ధర 128జిబి మెమొరీ వేరియంట్ కి వర్తిస్తుంది.
ఆపిల్ వెబ్‌సైట్ లో iPhone 14 ధర ఇంకా రూ.69,600 గా ఉంది.
ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్ గురించి మాట్లాడితే, 5 శాతం వరకు తగ్గింపు ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఈ బ్యాంక్ ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో పాటు, మీ పాత ఫోన్ మార్చుకుంటే, రూ.50,000 కు పైగా ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. అయితే, మీ పాత ఫోన్ కండిషన్‌ను బట్టి మీకు బోనస్ లభిస్తుంది.
iPhone 14 డివైజ్ ను యూజర్లు రెడ్, బ్లూ, మిడ్నైట్, పర్పుల్, స్టెరిలైట్ మరియు యెల్లో కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు.
iPhone 14 256జిబి మోడల్ 14 శాతం డిస్కౌంట్ తో ప్రస్తుతం రూ.67,999 కి లభిస్తోంది. 512జిబి స్టోరేజీ వేరియంట్ 19 శాతం డిస్కౌంట్ తో రూ.79,999 కి లభిస్తోంది.
iPhone 14 కొనవచ్చా?
iPhone 14 స్మార్ట్‌ఫోన్ 2023 లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఆపిల్ లేటెస్ట్ సిరీస్ iPhone 15 మార్కెట్ లో అందుబాటులో ఉంది. iPhone 14 విడుదలై ఏడాదైంది. అయితే పెర్ఫామెన్స్, కెమెరా మరియు బ్యాటరీ పరంగా చూస్తే ఈ ఫోన్ ఎందులోనూ తక్కువ కాదు. మరోవైపు, ఐఫోన్ 15 కూడా పెద్దగా అప్‌గ్రేడ్స్ తో రాలేదు. కాబట్టి, మీరు iPhone 14 ను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
iPhone 14 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: iPhone 14 లో 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ స్క్రీన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్, 1200 నిట్స్ బ్రైట్నెస్, ఫేస్ ఐడీ సెన్సర్ ఉన్నాయి.
ప్రాసెసర్: iPhone 14 డివైజ్ లో ఏ15 బయోనిక్ ప్రాసెసర్ ను వాడారు.
ర్యామ్, స్టోరేజీ: iPhone 14 డివైజ్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: iPhone 14 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12ఎంపి వైడ్ యంగిల్ ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
సాఫ్ట్‌వేర్: iPhone 14 స్మార్ట్‌ఫోన్ ఐఓఎస్ 17 ఓఎస్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: iPhone 14 లో 5జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్ మరియు లైట్నింగ్ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.
