iPhone 16 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ తన పాత ఐఫోన్ మోడల్స్ ధరలను తగ్గించింది. దీంతో ఐఫోన్ వాడాలని, కొనాలని కోరుకునే వారు తక్కువ ధరకే ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మ్యాటర్ ఏంటంటే, iPhone 14 Plus ఫోన్ ఒరిజినల్ లాంచ్ ధర కంటే రూ.30,000 తక్కువకే ప్రస్తుతం లభిస్తోంది. ఇప్పుడు ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.
iPhone 14 Plus ధర
| లాంచ్ ధర | రూ.89,990 |
| ఆపిల్ వెబ్‌సైట్ | రూ.69,900 |
| క్రోమా | రూ.69,900 |
| అమెజాన్ | రూ.64,999 |
| రిలయన్స్ డిజిటల్ | రూ.59,900 |
| ఫ్లిప్‌కార్ట్ | రూ.58,999 |
పైన అందించిన టేబుల్ లో iPhone 14 Plus ధర మరియు ఎక్కడెక్కడ అమ్ముడవుతుందో అనే వివరాలను ఇవ్వడం జరిగింది. పైన పేర్కొన్న ధర కాకుండా, ఫోన్ పై వివిధ బ్యాంకుల ఆఫర్లు, క్రెడిట్ కార్డ్స్ మరియు డెబిట్ కార్డ్స్ పై క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
iPhone 14 Plus ఫ్లిప్‌కార్ట్ లో చాలా తక్కువ ధరకి లభిస్తోంది. ఈ ఆర్టికల్ రాసే సమయానికి, ఈ ఫోన్ బ్లూ కలర్ లో మాత్రమే పేర్కొనబడిన అడ్రస్‌కి డెలివరీకి అందుబాటులో ఉంది. ఇతర కలర్ వేరియంట్స్ ఇప్పటికే అమ్ముడయిపోయాయి. ఆఫర్లు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
రిలయన్స్ డిజిటల్ లో iPhone 14 Plus పై హయ్యస్ట్ ఆఫర్ బెనిఫిట్ లభిస్తోంది. ఈ ఫోన్ రూ.59,900 గా ఉంది. హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ కస్టమర్లకు 7 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే దాదాపుగా రూ.4,500. అలాగే హెచ్డీఎఫ్‌సీ కస్టమర్లకు రూ.3,500 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
iPhone 14 Plus కొనేందుకు 5 కారణాలు
1. iPhone 14 Plus కేవలం ఏడాది క్రితమే లాంచ్ అయ్యింది. దీన్ని పాత మోడల్ అని అప్పుడే అనలేం.
2. iPhone 14 Plus లో 6.7-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే పెద్ద ప్లస్ పాయింట్. లేటెస్ట్ ఐఫోన్ 16 లో 6.1-ఇంచ్ స్క్రీన్ మాత్రమే ఉంది.
3. iPhone 14 Plus డివైజ్ ఆపిల్ ఏ15 బయోనిక్ ప్రాసెసర్ ఇచ్చారు. ఈ చిప్సెట్ స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ ఇస్తుంది.
4. iPhone 14 Plus డివైజ్ ఐఓఎస్ 18 ఓఎస్ అప్డేట్ ను కూడా పొందనుంది. అంటే ఐఫోన్ 16 మాదిరి సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.
5. iPhone 14 Plus డివైజ్ లో శాటిలైట్ కనెక్టివిటీ, ఈ-సిమ్ సపోర్ట్ కూడా అందించారు.
ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ రూ.60,000 లోపు లభిస్తుంది. కాబట్టి, దీన్ని కొనడంలో నష్టమేమీ లేదు. ఐఓఎస్ 18 అప్డేట్ వచ్చాక ఫోన్ మరింత వేగంగా పని చేస్తుంది.
iPhone 16, iPhone 16 Plus స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: iPhone 16 లో 6.1-ఇంచ్ స్క్రీన్, 2556*1179 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. మరోవైపు, iPhone 16 Plus లో 6.7-ఇంచ్ స్క్రీన్, 2796*1290 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి. రెండు ఫోన్లలో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, ట్రూటోన్, 2000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10, డాల్బీ విజన్, సిరామిక్ షీల్డ్ గ్లాస్ ఉన్నాయి.
చిప్సెట్: iPhone 16 మరియు iPhone 16 Plus రెండు ఫోన్లలో ఏ18 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఇందులో 2 పెర్ఫామెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.89గిగాహెర్ట్జ్.
మెమొరీ: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లు 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
కెమెరా: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి 2ఎక్స్ మెయిన్ కెమెరా, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లలో 12ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: iPhone 16 లో పవర్ బ్యాకప్ కోసం 3561 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. iPhone 16 Plus లో 4006 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
కనెక్టివిటీ: iPhone 16 మరియు iPhone 16 Plus ఫోన్లలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, మ్యాగ్‌సేఫ్, క్యూఐ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
