Home News లీకైన పర్పుల్ కలర్ iPhone 14 Pro ఇమేజ్, నాచ్ ని యాపిల్ తొలగించిందా?

లీకైన పర్పుల్ కలర్ iPhone 14 Pro ఇమేజ్, నాచ్ ని యాపిల్ తొలగించిందా?

హైలైట్స్:

సెప్టెంబర్ 7 యాపిల్ ఈవెంట్ కి ఇంకా రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ఈ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్, వాచ్ ఎస్ఈ, హై-ఎండ్ యాపిల్ వాచ్ లాంచ్ కానున్నాయి. సరికొత్త ఎయిర్‌పాడ్స్ ప్రో, ఐప్యాడ్ మోడల్స్ ని కూడా యాపిల్ రివీల్ చేయనుంది. ఈలోపు, నెట్టింట్లో ప్రత్యక్షమైన లీక్స్ ద్వారా ఐఫోన్ 14 ప్రో డిజైన్, న్యూ పర్పుల్ కలర్ ఆప్షన్ బయటకు వచ్చాయి.

పేటెంట్లీ యాపిల్, 9టు5మ్యాక్ ద్వారా యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ లో యాపిల్ ఫైల్ చేసిన అప్లికేషన్ ను వెలికితీసింది. దీని ద్వారా రానున్న యాపిల్ ఫోన్స్ లో నాచ్ స్థానంలో పిల్-షేప్డ్ కటౌట్ ఉండనుంది. పదండి ఆ లుక్ పై ఓ కన్నేద్దాం.

Apple iPhone 14 Pro కలర్స్, డిజైన్ లీక్స్

డ్యుయన్ రుయి అనే ట్విట్టర్ యూజర్ పలు పోస్టుల ద్వారా విభిన్న ఫోటోలను షేర్ చేస్తూ, ఐఫోన్ 14 ప్రో ఇదేనని చెప్పాడు. ఐఫోన్ 14 ప్రో మొత్తం 5 రంగుల్లో రానున్నట్లు సమాచారం. అవి: పర్పుల్, నేవీ బ్లూ, గోల్డ్, గ్రే, సిల్వర్.

మిగతా పోస్ట్ ద్వారా ఐఫోన్ 14 ప్రో అని చెప్పబడుతోన్న ఫోన్ యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. కొన్ని కోణాల్లో చూస్తే, ఐఫోన్ 14 ప్రో పర్పుల్ కలర్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇక మూడో ఇమేజ్ పోస్ట్ ద్వారా పిల్-షేప్డ్ కటౌట్ iPhone 14 Pro పై ఉన్న ట్లు తెలుస్తోంది. అంటే ఐఫోన్ ఎక్స్ లో చూసినట్లుగా ట్రెడిషనల్ నాచ్ ఉండదని స్పష్టమైంది. అయితే ఇవి వెరిఫై కాబడని, iPhone 14 Pro యొక్క ఇమేజెస్ అని గమనించాలి. ఇందులో ఎంత వరకు నిజముందో మనకు తెలియదు.

No-Notch ఐఫోన్ డిస్ప్లే టెక్నాలజీపై పేటెంట్ పొందిన Apple

iPhone 14 Pro లో పిల్-షేప్డ్ కటౌట్ ఇవ్వబోతున్నట్లు పేటెంట్ ద్వారా అర్థమవుతున్నట్లు పలు కథనాలు తెలుపుతున్నాయి. ఈ తరహా డిజైన్ లో కెమెరా, ఇన్ఫ్రారెడ్ లైట్ ఎమిటర్, లైట్ ఫోల్డింగ్ ఎలిమెంట్ ఉండనున్నాయి. ఏదేమైనా, కొత్త రకం డిస్ప్లే డిజైన్ వల్లన స్క్రీన్ స్పేస్ ఎక్కువ కానుంది.

యాపిల్ అనలిస్ట్ మింగ్-చి కువో, లీకర్ మార్క్ గుర్మన్ iPhone 14 సిరీస్ లో పిల్-షేప్డ్ కటౌట్ డిస్ప్లే ఉండనున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక ప్రముఖ టిప్ స్టర్స్ నుంచి బయటకు వచ్చిన iPhone 14 Pro కి సంబంధించిన లీక్స్ కూడా నాచ్ లేని ఐఫోన్ పై ఆశాలను రేపుతున్నాయి. ఈ ఏడాది నో-నాచ్ ఐఫోన్ ని మనం చూస్తామని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఓటీటీ, ఆటోమొబైల్ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.