హైలైట్స్:
- బీఐఎస్ వెబ్ సైట్ లో దర్శనమిచ్చిన కొత్త యాపిల్ మోడల్ నంబర్, ఐఫోన్ 14 అయ్యుంటుందని అంచనా
- గ్లోబల్ ఫ్యాక్టరీలతో పాటు భారత్ లో కూడా ఐఫోన్ 14 ని తయారు చేయనున్న యాపిల్ సంస్థ
- సెప్టెంబర్ 7 న లాంచ్ కానున్న కొత్త ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు
యాపిల్ నుంచి రానున్న తదుపరి ఫోన్ ఐఫోన్ 14 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ను పొందింది. ఎలక్ట్రానిక్ డివైజెస్ కి క్లియరెన్స్ ఇచ్చే సర్టిఫైయింగ్ అథారిటీయే ఈ బీఐఎస్ సంస్థ. అయితే ఐఫోన్ 14 అని బీఐఎస్ లిస్టింగ్ లో పేర్కొనబడలేదు. అయితే ఏ2882 అనే మోడల్ నంబర్ తో ఉన్న డివైజ్ యాపిల్ నుంచి రానున్న ఐఫోన్ దేనని స్పష్టమైంది.
త్వరలో భారత్ లో కూడా తయారు కానున్న iPhone 14
నివేదికలను బట్టి, యాపిల్ యొక్క ఐఫోన్ 14 సిరీస్ ఒకేసారి భారత్ లో అలాగే గ్లోబల్ గా లాంచ్ కానుంది. గత కొన్నాళ్ళుగా యాపిల్ ఇలాగే లాంచ్ చేస్తూ వస్తోంది. అయితే, త్వరలో భారత్ లో కూడా ఐఫోన్ లను తయారు చేయాలని యాపిల్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐఫోన్ 14 ని గ్లోబల్ ఫ్యాక్టరీలతో పాటు ఇండియాలో కూడా తయారు చేయబోతోంది.
భారత్ లో ఉత్పత్తి కంటే ముందు చైనాలో తయారీని యాపిల్ మొదలు పెట్టనుంది. యాపిల్ 13 ఫోన్ ని భారత్ లో తయారు చేసిన యాపిల్, గతేడాది సెప్టెంబర్ లో లాంచ్ చేసింది. అయితే, ఈ ఏడాది మాత్రం తొలుత చైనాలో తయారైన కొత్తతరం ఐఫోన్స్ లాంచ్ తర్వాత, రెండు నెలలకు ఇండియాలో తయారైన ఫోన్లు లాంచ్ అవ్వనున్నాయి. ఇండియాతో తయారవుతున్నట్లే కానీ, యాపిల్ ఫోన్ ధరలు మాత్రం ఇంకా ఆకాశంలోనే ఉంటున్నాయి. మరి దీనిపై యాపిల్ సంస్థ కాస్త దృష్టి పెడితే మేలు. లేదా ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్లనైనా తయారు చేస్తే యాపిల్ ఫోన్ కొనాలన్న కోరికను కొందరైనా నెరవేర్చుకుంటారు.
ఇక ఐఫోన్ 14 సిరీస్ విషయానికి వస్తే, ఇది పాత కొత్తల కలయిక అని తెలుస్తోంది. ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 మ్యాక్స్ పాత తరం ఏ15 బయోనిక్ చిప్ తో వస్తున్నట్లు సమాచారం. అలాగే ఇవి రెండు కూడా హయ్యర్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటాయని అంచనా. ఇక ఐఫోన్ 14 ప్రో మోడల్స్ ఏ16 చిప్ తో రానున్నాయి. అలాగే 48ఎంపి రియర్ కెమెరాలను కలిగి ఉండి, కొత్త నాచ్ డిజైన్ తో వస్తున్నాయి. ఐఫోన్ 13 మిని తో పోలిస్తే, కొత్త ఐఫోన్ 14 ధరలు 100 డాలర్లు ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఇక ప్రో ఐఫోన్స్ లో అత్యధిక స్టోరేజీ ఆప్షన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈసారి యాపిల్ కొత్త ఫోన్లు వినూత్నతను చాటడం ఖాయమని అర్థమవుతోంది. అయితే ధరలు వంద డాలర్లు పెరుగుతాయని అంటున్న నేపథ్యంలో ఐఫోన్ విక్రయాలపై ప్రభావం ఉంటుందేమో చూడాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.