
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple తాజాగా iPhone 15 Plus పై డిస్కౌంట్ ప్రకటించింది. పెద్ద స్క్రీన్ గల ఐఫోన్ వాడాలని అనుకునే వారికి ఐఫోన్ 15 ప్లస్ మంచి ఆప్షన్. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్లస్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.75,000 కి లభిస్తోంది. రూ.13,600 డిస్కౌంట్ తర్వాత ఈ ధరకి ఐఫోన్ 15 ప్లస్ లభిస్తుంది. మరి, ఆ డిస్కౌంట్ ఆఫర్ వివరాలు ఏంటో తెలుసుకుందామా?
iPhone 15 Plus పై డిస్కౌంట్
iPhone 15 Plus స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.89,600 గా ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో దీనిపై 15 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ధర రూ.75,000 తగ్గనుంది. 128జిబి బేస్ వేరియంట్ ధరను డిస్కౌంట్ ధరకి సొంతం చేసుకోవచ్చు.
అంతేకాదు, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.1,500 అదనపు డిస్కౌంట్ మరియు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు.
iPhone 15 Plus 256జిబి వేరియంట్ ధర కూడా డిస్కౌంట్ తర్వాత రూ.99,600 నుంచి రూ.85,999 తగ్గుతుంది.
iPhone 15 Plus 1టిబి వేరియంట్ ప్రస్తుతం రూ.1,05,999 కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,19,600 గా ఉంది.
కంపెనీ వెబ్‌సైట్ పై, 128జిబి వేరియంట్ ధర రూ.89,600 గా ఉంది. 256జిబి వేరియంట్ ధర రూ.99,600 గా ఉంది. 512జిబి మోడల్ ధర రూ.1,19,600 గా ఉంది.
iPhone 15 Plus స్పెసిఫికేషన్స్
స్క్రీన్: iPhone 15 Plus డివైజ్ లో 6.7-ఇంచ్ ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్, 2532*1170 పిక్సెల్స్ రెజుల్యూషన్ అందించారు. ఈ ఫోన్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్స్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కి మరిన్ని మెరుగులు దిద్దినట్లు ఆపిల్ చెబుతోంది.
చిప్సెట్: iPhone 15 Plus లో ఏ16 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది మెరుగైన పెర్ఫామెన్స్ ని అందించనుంది.
బ్యాటరీ: iPhone 15 Plus లో పవర్ బ్యాకప్ కోసం 4,912 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
కెమెరా: iPhone 15 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ట్రూడెప్త్ కెమెరా అందించారు.
కనెక్టివిటీ: iPhone 15 Plus లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.











